ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన వేణు.. తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన జగపతిబాబు గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు కామెడీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ప్లేస్ ను సాధించాడు. హీరోగా, కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించ్చాడు హీరో వేణు .. హీరోగా సినిమాలు మానేసిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నిసినిమాలు చేసి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు వేణు. హీరోగా వెణు నటించిన స్వయంవరం, హనుమాన్ జంక్షన్, నిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే.. లాంటి ఎన్నో సినిమాల సూపర్ హిట్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక సహాయనటుడిగా ఎన్టీఆర్ దమ్ము సినిమాలో నటించి ఆతరువాత సినిమాలకు దూరంఅయ్యాడు వేణు.
సినిమాలు మానేసి.. ఇండస్ట్రీకి దూరమైన చెన్నైలో స్థిరపడడ్డాడు. అక్కడే పలు వ్యాపారాలు చేస్తూ ఫుల్ బిజీగా అయ్యాడు..చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో రీసెంట్ గా రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలి అనుకున్నాడు రవితే. కాని ఇప్పటివరకూ ఆయన ఏ సినిమాకు సైన్ చేసిన దాఖలాలు మాత్రం లేవు. కెరియర్ లో బిజీ అవ్వాలను కుంటున్నప్పటికీ కూడా అవకాశాలు మాత్రం రావడంలేదు. ..మంచి కథ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు..
రీసెంట్ గా ఓమీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు సంచలన విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు జగపతి బాబు గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాను ఒక వ్యక్తికి డబ్బులు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించిన వేణు.ఆడబ్బులు ఇంత వరకూ తన దగ్గరకు రాలేదు అన్నారు. అయితే ఆ వ్యాక్తికి జగపతి బాబు హామీ ఇచ్చారని... అలా 14 లక్షలు తాను పోగొట్టుకున్నాను. ఆ సమయంలో నాకది చాలా ఎక్కువ డబ్బు అయితే జగపతిబాబు గారు కనీసం ఫోన్ చేసి ఆ తర్వాత ఒకసారి కూడా డబ్బులు ఇచ్చాడా అని అడగలేదు. ఇక అతడు ఇవ్వడు అని నాకు అర్థం అయింది. అందుకే ఇక ఆ గొడవని నేను వదిలేసాను.. అని అన్నారు వేణు.
అంతే కాదు ఆ సంఘటన జరిగిన తరువాత కూడా జగపతిబాబుగారు తనతో మాట్లాడలేదని... ఆతరువాత అసలు మాట్లాడటం మానేశారని అన్నారు వేణు. ఆయన అలా చేయడం బాధకలిగించిందన్నారు. ఇక ప్రస్తుతం వ్యాపారాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు వేణు. సినిమాలు చేయానికూడా రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
