వెంకటేష్ డెబ్యూ వెబ్ సిరీస్ రానా నాయుడు త్వరలో స్ట్రీమ్ కానుంది. టైటిల్ విషయంలో హర్ట్ అయిన వెంకటేష్ నెట్ఫ్లిక్స్ కి వార్నింగ్ ఇచ్చాడు.

చూస్తుంటే టాప్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ల బాటపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ కి చెందిన పలువురు నటులు, ఓ మోస్తరు హీరోలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. నాగ చైతన్య దూత టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. వెంకటేష్-రానా మల్టీస్టారర్ తో దిగిజిటల్ సిరీస్లో అడుగుపెట్టనున్నారు. వారిద్దరూ కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. 

హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ రీమేక్ ఆధారంగా రానా నాయుడు రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ సైతం చివరి దశకు చేరుకుందని సమాచారం. త్వరలో రానా నాయుడు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారు. కాగా రానా నాయుడు టైటిల్ విషయంలో వెంకటేష్ హర్ట్ అయ్యారట. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ కి వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడు. ''తప్పు చేయొద్దు నెట్ఫ్లిక్స్. హీరో నేను, స్టార్ ని నేను, ఫ్యాన్ బేస్ ఉంది నాకు. కిరాక్ లుక్ నాది. అలాంటప్పుడు టైటిల్ గా ఎవరి పేరుండాలి. నాగా నాయుడు. ఇది టైటిల్ గా పెట్టండి. నాతో పెట్టుకోవచ్చు. మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ అవుతుంది'' అని వీడియో బైట్ విడుదల చేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…


సిరీస్ టైటిల్ గా వెంకీ క్యారెక్టర్ పేరు కాకుండా రానా క్యారెక్టర్ నేమ్ పెట్టినందుకు వెంకటేష్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఆయన కోపం నిజం కాదులెండి. రానా నాయుడు ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ ఈ వీడియో విడుదల చేశారు. 

మరోవైపు వెంకటేష్ సైంధవ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సైంధవ్ అనౌన్స్మెంట్ టీజర్ విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సైంధవ్ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.