మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మోసగాళ్లు. హాలీవుడ్ దర్శకుడు జెఫరీ జీ చిన్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇండో అమెరికన్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్నారు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐ టి స్కామ్ ఆధారంగా తెరకెక్కుతుండగా హీరో విష్ణు ఐ టి ప్రొఫెషనల్ గా కనిపించనున్నారని సమాచారం. సాంకేతికతో మోసాలకు పాల్పడే ఖతర్నాక్ గా విష్ణు పాత్ర ఉండే అవకాశం కలదు. 

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ కూడా నటిస్తున్నారు. కాజల్ హీరో విష్ణు చెల్లెలిగా నటిస్తున్నారని ఇది వరకే చిత్ర యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. ఐ టి మోసాలకు పాల్పడే అన్నాచెల్లెళ్లుగా వీరి పాత్రలపై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొని ఉంది. కాగా నేడు ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. హీరో విక్టరీ వెంకటేష్ మోసగాళ్లు మోషన్ పోస్టర్ విడుద చేశారు. 

సోషల్ మీడియాలో మోసగాళ్లు మోషన్ పోస్టర్ విడుదల చేసిన వెంకటేష్, టీమ్ సభ్యులకు బెస్ట్ విషెష్ తెలిపారు. మోసగాళ్లు టైటిల్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపేదిగా ఉంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ అధికారిగా ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా థియేటర్స్ బంద్ నేపథ్యంలో విడుదల వాయిదాపడింది. దీనితో థియేటర్స్ తెరుచుకునే వరకు ఎదురుచూస్తారా? లేక ఓ టి టి లో విడుదల చేస్తారా? అనేది చూడాలి.