వెంకీ ఎన్నడూ చూడని వ్యతిరేకత... మిస్టేక్ ఎక్కడ జరిగింది!

క్లీన్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఆయన రానా నాయుడు సిరీస్లో నాగ నాయుడు పాత్ర చేయడం పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 

Hero venkatesh gets huge criticism by rana naidu web series

రెండు రోజులుగా సోషల్ మీడియాలో రానా నాయడు వెబ్ సిరీస్ గురించి చర్చ నడుస్తుంది. హీరో వెంకటేష్, హీరో రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ సిరీస్ దగ్గుబాటి హీరోల పరువు తీసింది. ఇది బూతు సిరీస్ అని ఆడియన్స్ తేల్చేశారు. డిజిటల్ కంటెంట్ పై పరిమితులు తక్కువ. సిల్వర్ స్క్రీన్ తో పోల్చితే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్లకు సెన్సార్ కట్స్ ఉండదు. మితిమీరిన శృంగారం, హింస, బూతు పదాలు స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అది ఎంత వరకు ఉండాలనేది సదరు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్, నటులు, డైరెక్టర్స్ విజ్ఞతకే  వదిలేశారు. కొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో సెమీ న్యూడ్, అడల్ట్ కంటెంట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఓటీటీ కంటెంట్ హద్దులు దాటేస్తుందని ప్రభుత్వాలు కూడా ఆందోళల వ్యక్తం చేశాయి. 

అయితే వెంకటేష్ వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన ఫ్యామిలీ చిత్రాల హీరో నోటి నుండి పచ్చిబూతులు వస్తే జీర్ణించుకోవడం కష్టమే. ముఖ్యంగా ఆయన అభిమానగణంలో మహిళా ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఉంటారు. మన వెంకీ ఉన్నాడని ఇంటిల్లిపాది కూర్చొని చూసేటప్పుడు బూతు పదాలతో కూడిన సన్నివేశాలు వస్తే అల్లకల్లోలమే.  రానా నాయుడు ట్రైలర్ చూశాక ఈ సందేహం వచ్చింది. పూర్తి సిరీస్ చూశాక... ట్రైలర్ లో చూపించింది తక్కువని క్లారిటీ వచ్చింది. 

అసలు వెంకటేష్ ఇలాంటి పాత్రను ఎలా ఒప్పుకున్నారు. ఒకవేళ ఒప్పుకున్నా ఆయనకున్న ఇమేజ్, తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొద్దోగొప్పో మార్చాలి కదా, అంటున్నారు. సిరీస్ మొదలైన కాసేపటికే సాంప్రదాయ వాదులు టీవీలు కట్టేసే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయం. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్ చిత్రాలతో అశేష అభిమానులను సంపాదించుకున్న వెంకటేష్ నుండి ఈ స్థాయి అడల్ట్ కంటెంట్ ఊహించలేదంటున్నారు. అమ్మనా బూతులతో ఎపిసోడ్స్ నింపేశారంటున్నారు. 

వెంకటేష్ రూత్ లెస్ క్రిమినల్ క్యారెక్టర్ లో డిఫరెంట్ గా తోచాడు. కానీ దారుణమైన బూతులు మాట్లాడారు.ఇక్కడ మేకర్స్ ని తప్పుబట్టడానికి లేదు. రానా నాయుడు రే డొనోవన్ రీమేక్ కాగా ఆ హాలీవుడ్ పాత్రల షేడ్స్ మక్కీ మక్కీ దించే ప్రయత్నం చేశారు. అలాగే వెబ్ సిరీస్లలో వ్యవహారికంలో ఉన్న భాష వాడేశారు. మొత్తంగా రానా నాయుడు సిరీస్ నవ్వులపాలు కావడంతో పాటు, నెట్ఫ్లిక్స్ కి ఎలాంటి ప్రయోజనం చేయలేదంటున్నారు. 

నెట్ఫ్లిక్స్ లో మార్చి 10 నుండి రానా నాయుడు స్ట్రీమ్ అవుతుంది. సుర్విన్ చావ్లా మరో కీలక రోల్ చేశారు. రే డొనోవన్ హాలీవుడ్ లో 12 ఎపిసోడ్స్ చొప్పున 7 సీజన్స్ ప్రసారమైంది. అంత పెద్ద సక్సెస్ ఫుల్ సిరీస్ రానా నాయుడుగా ఇండియాలో మాత్రం వ్యతిరేకత ఎదుర్కొటుంది. కరణ్ అన్షుమన్, సుప్రన్  ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. కాగా వెంకీ హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలనుతో సైంధవ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios