హీరో వరుణ్ తేజ్ తన 13వ చిత్ర అప్డేట్ ఇచ్చారు. అలాగే అదిరిపోయే లుక్ షేర్ చేశారు. అధికారిక విడుదలకు ముందే ఫస్ట్ లుక్ పై హింట్ ఇచ్చాడు.
ప్రయోగాత్మక చిత్రాలకు వరుణ్ తేజ్ పెట్టింది పేరు. కంచె, అంతరిక్షం ఈ కోవకు చెందినవే. సాధారణంగా యంగ్ హీరోలు మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేస్తారు. ప్రయోగాత్మక చిత్రాల జోలికి పోరు. వరుణ్ కమర్షియల్ చిత్రాలు చేస్తూనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ టచ్ చేస్తున్నారు.వరుణ్ తేజ్ 13వ చిత్రం మరొక ప్రయోగం అని చెప్పొచ్చు. ఇది ఆయన బాలీవుడ్ డెబ్యూ మూవీ అని చెప్పొచ్చు. తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ యుద్ధ విమానాల పైలెట్ గా నటిస్తున్నట్టు సమాచారం.
నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈమూవీ లేటెస్ట్ అప్డేట్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇటీవల మొదలైన గ్వాలియర్ షెడ్యూల్ కంప్లీట్ చేశారట. అప్డేట్ తో పాటు వరుణ్ తేజ్ పైలట్ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం వరుణ్ కెరీర్ కి చాలా అవసరం. పాజిటివ్ టాక్ తెచ్చేనుకుంటే బాలీవుడ్ లో మార్కెట్ సంపాదించవచ్చు.
మరోవైపు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. గరుడ వేగ మూవీతో పరిశ్రమను ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ వరుణ్ తేజ్ నుండి యాక్షన్ మూవీస్ రానున్నాయి.
గత ఏడాది వరుణ్ కి పెద్దగా కలిసి రాలేదు. గని మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ప్రొఫెషనల్ బాక్సర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. మూవీలో కంటెంట్ లేకపోవడంతో దెబ్బేసింది. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 కూడా పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. మరి 2023లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
