తన ముద్దుల చెల్లి నిహారిక పట్ల తన ప్రేమ చాటుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ఇటీవలే నిహారిక వివాహం జరుగగా ఇప్పటికీ తాను పెళ్లి చేసుకునేంత పెద్ద అమ్మాయి అయ్యిందంటే నమ్మలేక పోతున్నాని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక మిత్రులు, మిగతా బంధువుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 

 
కాగా నిహారిక పెళ్ళై అత్తారింటికి వెళ్లిపోగా... తన బర్త్ డే నాడు వరుణ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటికీ నిహారిక ఇంత పెద్దది అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం.నీచుట్టూ ఉన్న వారికీ ఆనందం పంచుతావు, హ్యాపీ బర్త్ డే బంగారు తల్లీ'' అని ట్విట్టర్ లో తన సందేశం పోస్ట్ చేశాడు వరుణ్. పెళ్ళైన తరువాత మొదటి పుట్టినరోజు జరుపుకుంటుంది నిహారిక. 1993 డిసెంబర్ 18న జన్మించిన నిహారిక నేడు 27వ ఏట అడుగుపెట్టడం జరిగింది. భర్త చైతన్యతో బర్త్ డే ప్రత్యేకంగా జరుపుకున్నారు నిహారిక. 
 
 చెల్లిపై ఇంత ప్రేమ ఉంది కనుకే, మంచి భర్తతో పరిశ్రమ మొత్తం చెప్పుకొనేలా నిహారిక పెళ్లి చేశాడు వరుణ్. ఉదయ్ పూర్ ప్యాలస్ లో దాదాపు ఐదురోజులు ఈ వివాహం జరుగగా, మెగా హీరోలు అద్భుతమైన దుస్తులు, నగలు ధరించి కనిపించారు. ఖరీదైన వివాహాలలో ఒకటిగా నిహారిక వివాహం నిలిచింది. కాగా వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.