తరుణ్ కి పెళ్ళీడు వచ్చి చాలా కాలం అవుతుంది. సిల్వర్ స్క్రీన్ కి దూరం కావడంతో అయనపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తరుణ్ అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. హీరోగా కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. డెబ్యూ మూవీ నువ్వే కావాలి అతిపెద్ద బ్లాక్ బస్టర్. తరవాత కూడా రొమాంటిక్ జోనర్లో హిట్స్ కొట్టి టైర్ టు హీరోగా నిలదొక్కుకున్నాడు. అనూహ్యంగా తరుణ్ కెరీర్ కింద పడిపోయింది. వరుస పరాజయాలతో ఫేడ్ అవుట్ అయ్యాడు.
ఈ క్రమంలో కొన్ని వివాదాలు చట్టుముట్టాయి. ఆర్తి అగర్వాల్ తో అఫైర్ రూమర్స్ వినిపించాయి. పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. విచారణలకు హాజరయ్యాడు. ఇక సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. తరుణ్ పెళ్లి, కెరీర్ పై కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన తల్లి రోజా రమణి స్పందించారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి మాట్లాడుతూ... తరుణ్‌పై వస్తున్న రూమర్స్ చూసి చాలా బాధ కలుగుతుందని అన్నారు.. ఓ యూట్యూబ్ కహఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె 'తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు. ఒక వెబ్ సిరీస్‌తో పాటు సినిమాను చేయబోతున్నాడు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేను. మీ ఆశిస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్లీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నానన రోజా రమణి విశ్వాసం వ్యక్తం చేశారు.
తరుణ్ ప్రతి రోజూ గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ఎవరీ ఇయర్ తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం మాంసం తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. తరుణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తరుణ్ కి పెళ్లి అయితే చాలు. అంతకు మించి నాకు పెద్ద కోరికలు లేవన్నారు. రోజారమణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
