లవర్‌ బాయ్‌ తరుణ్‌ త్వరలో పెళ్ళిపీఠలెక్కబోతున్నారు. ఇటీవల దిల్‌రాజు, రానా, నిఖిల్‌, నితిన్‌ వరుసగా పెళ్లిళ్ళు చేసుకుని బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ఇప్పుడు తరుణ్‌ కూడా వారి బాటలో పయనించబోతున్నాడు. త్వరలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాను చేసుకోబోయే అమ్మాయి కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయట. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే
అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్‌ టాక్‌. 

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ని ప్రారంభించిన తరుణ్‌ బాల నటుడిగా `ఆదిత్య 369`లో మెరిసిన విషయం తెలిసిందే. ఇక హీరోగా మారి ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన `నువ్వే కావాలి` అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతోపాటు `నువ్వే నువ్వే`,`ప్రియమైన నీకు`, `శశిరేఖా పరిణయం`, `నవవసంతం` వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

అయితే ఆర్తి అగర్వాల్‌తో ప్రేమాయణం తరుణ్‌ లైఫ్‌ని డిస్టర్బ్ చేసింది.కెరీర్‌ పరంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఆమెని పెళ్ళి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు కూడా. కానీ అనుకోకుండా ఆమె ఆత్మహత్య చేసుకోవడం పెద్ద దుమారం సృష్టించింది. దీంతో తరుణ్‌ మానసికంగా మరింతగా స్ట్రగుల్‌ అయ్యారు. దీని వల్ల సినిమాలు కూడా చేయలేదు. 

ఇటీవల మళ్ళీ హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా వ్యాపార పనులు చూసుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ టైమ్‌ హీరోల పెళ్లిళ్ళకు వెకేషన్‌గా మారిందనే సెటైర్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.