హీరో సూర్యకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రజనీ తర్వాత ఏ ఘనత దక్కించుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు.

హీరో సూర్యకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రజనీ తర్వాత ఏ ఘనత దక్కించుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. జూలై 23న సూర్య తన 48వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సూర్య అభిమానులు బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. కంగువ టీజర్ కూడా రావడంతో సూర్య బర్త్ డేకి ఫ్యాన్స్ కి అసలైన కనుక అందినట్లు అయింది. కంగువ చిత్రంలో సూర్య మరోసారి విలక్షణ నటనతో రెచ్చిపోతున్నారు. అయితే సూర్య జన్మదిన వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఊహించని విషాదం జరిగిన సంగతి తెలిసిందే. 

సూర్య బర్త్ డే కి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ నరసారావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్, పోలూరు సాయి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. ఈ పెను విషాదం సూర్య అభిమానులని కలచి వేసింది. వారి కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. 

ఈ సంఘటన గురించి తెలుసుకున్న హీరో సూర్య వెంటనే స్పందించారు. మరణించిన అభిమానుల కుటుంబాలని సూర్య వీడియో కాల్ లో పరామర్శించారు. ఓ అభిమాని కుటుంబం అయితే.. మా ఇంట్లో మగదిక్కు లేకుండా పోయింది.. భర్త మరణించాడు.. ఇప్పుడు కొడుకు కూడా లేడు అంటూ బోరున విలపించింది. దీనితో సూర్య పోయిన ప్రాణాలు తీసుకురాలేనని.. కానీ అన్ని విధాలుగా అండగా ఉంటూ అమ్మాయికి మంచి ఉద్యోగం ఇప్పించే భాద్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలలో ధైర్యం నింపాడు. 

Scroll to load tweet…

మరణించిన అభిమానులలో ఒకరి సోదరి సూర్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూ తాను డిగ్రీ పూర్తి చేశానని.. ఇప్పుడు అమ్మని, అమ్మమని చూసుకోవాల్సిన భాద్యత తనదే అని చెప్పింది. జాబ్ అవకాశం ఇవ్వాలని సూర్యని కోరింది. దీనికి సూర్య స్పందింస్తూ తప్పకుండా ఆ బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉద్యోగం మాత్రమే కాదు ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హృదయాలు ద్రవించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.