అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి బాజా మోగనొంది. హీరో సుమంత్‌ రెండో పెళ్లికి సిద్దమయ్యారు. తాజాగా ఆయన వెడ్డింగ్‌ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

హీరో సుమంత్‌ రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన పవిత్ర అనే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారట. త్వరలోనే వీరి మ్యారేజ్‌ జరగబోతుందని సమాచారం. తాజాగా సుమంత్‌ వెడ్డింగ్‌ కార్డ్ వైరల్‌ అవుతుంది. ఇందులో సుమంత్‌ కుమార్‌ వెడ్స్ పవిత్ర అని వెడ్డింగ్‌ కార్డ్ ఉంది. ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వెడ్డింగ్‌ కార్డ్ రెడీ అయ్యిందంటే ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయ్యిందని అర్థమవుతుంది. సీక్రెట్‌గా ఈ వ్యవహారాలను పూర్తి చేసినట్టు సమాచారం. 

అయితే ఇప్పటికే సుమంత్‌కి హీరోయిన్‌ కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. 2004లో వీరి మ్యారేజ్‌ జరగగా, 2006లోనే విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దాదాపు 15ఏళ్లుగా ఒంటరిగానే ఉన్నారు సుమంత్‌. ఎట్టకేలకు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారట. అయితే ఇప్పుడు తాను చేసుకునే అమ్మాయి పవిత్ర తన బంధువుల కూతురని తెలుస్తుంది. అదే సమయంలో లాంగ్‌ టైమ్‌ గర్ల్ ఫ్రెండ్‌ అనే వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. 

Scroll to load tweet…

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌ `ప్రేమకథ`తో వెండితెరకు పరిచయమయ్యారు. `స్నేహమంటే ఇదేరా`, `సత్యం`, `గోదావరి`, `గోల్కోండ హైస్కూల్‌` చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరుస పరాజయాలు ఆయన్ని కోలుకోకుండా చేశాయి. మూడేళ్ల క్రితం`మళ్లీరావా` సక్సెస్‌తో పుంజుకున్నారు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన `కపటధారి` మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా `అనగనగా ఒక రౌడీ`లో నటిస్తున్నారు.