అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'మళ్ళీ మొదలైంది'.
విడాకుల కాన్సెప్ట్ తో ఫన్ ఎలిమెంట్స్ తో కీర్తి కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమంత్ కి జోడిగా వర్షిణి సౌందరరాజన్, నైనా గంగూలీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న డైరెక్ట్ గా ఓటిటి జీ5లో రిలీజ్ కానుంది. దీనితో సుమంత్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఓ ఇంటర్వ్యూలో సుమంత్.. పవన్ కళ్యాణ్, జగన్ పై స్పందించారు. వైఎస్ జగన్ సుమంత్ ఇద్దరూ క్లాస్ మేట్స్. సుమంత్ మాట్లాడుతూ జగన్ గొప్ప పొజిషన్ కి చేరుకుంటాడని తెలుసు. జగన్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. రాజకీయాలపై నాకు అవగాహన లేదు. కానీ అప్పుడప్పుడూ ఏం జరుగుతుందో వింటూ ఉంటా.
జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. క్లారిటీ లేకుండా నేను మాట్లాడలేను అని సుమంత్ అన్నారు. కానీ రెండు పార్టీల మధ్య నాయకుల మధ్య విభేదాలు ఉండడం సహజమే కదా.. రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం అని సుమంత్ అన్నారు.
ఇక రూమర్స్ గురించి అసలు పట్టించుకోను. సైలెంట్ గా నా పని నేను చేసుకోవడం మాత్రమే తెలుసు అని సుమంత్ అన్నారు. ఏది ఏమైనా సుమంత్ ఫోకస్ మొత్తం ప్రస్తుతం మళ్ళీ మొదలైంది మూవీపైనే ఉంది. ఈ చిత్రం విజయం సాధించడం సుమంత్ కి చాలా కీలకం.
