తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై స్పందించారు సీనియర్ హీరో సుమన్. ఒక రకంగా ఫైర్ అయ్యారు. వదంతులు వ్యాప్తి చెందిస్తున్న వారిపై మండిపడ్డారు. వారిపై చర్యలకు డిమాండ్ చేశారు.
తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించారు సీనియర్ హీరో సుమన్. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని వదంతులు నవ్వంద్దు అంటూ ఆయన స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ..ఆయన తెలిపారు. ఒక సినిమా షూటింగ్ కోసం బెంగళూరులో ఉన్న సుమన్.. ఈ విధంగా ప్రకటన రిలీజ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి న్యూస్ ను వైరల్ చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు.
సీనియర్ హీరోగా సుమన్ చనిపోయాడంటూ.. నార్త్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేశాయి. ఆ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కు చేరింది. అది కాస్తా వైరల్ అవ్వడంతో .. సౌత్ లో కూడా ఈ న్యూస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది. దాంతో సుమన్ అభిమానులు ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో కూడా రకరకాల కామెంట్లు.. రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. సుమన్ కు ఏమైందంటూ చాలా మంది ప్రశ్నిచడం మొదలు పెట్టారు. దాంతో ఈ విషయం ఆయన దగ్గరకు చేరింది. దాంతో ఈ విషయంలో ఘాటుగా స్పందించారు సుమన్.
తనపై ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ పై చట్టపరంగా కేసు వేస్తానన్నారు సుమన్. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. రెగ్యూలర్ గా షూటింగ్స్ చేసుకుంటున్నానని. అటువంటిది తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా వార్తలు ఎలా ప్రాసారం చేస్తారంటూ మండిపడ్డారు. ఆ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు సుమన్. ఇక హీరోగా.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. సుమన్ సౌత్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఆయనకు ఫ్యామిలీ లేడీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం సౌత్ నుంచి అన్ని భాషల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు సుమన్.
