గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు.. సిక్స్ ప్యాక్ హీరో ఇలా మారిపోయాడేంటీ.?

యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ తో చాలా ఫిట్ గా ఉండే నటుడు లడ్డూ బాబుగా కొత్త అవతారం ఎత్తాడు. ప్రస్తుతం లుక్ వైరల్ అవుతోంది.
 

Hero Sudheer Babu Shocking Makeover viral look

సిక్స్ ప్యాక్ తో చాలా ఫిట్ గా కనిపించే హీరో సుధీర్ బాబు షాకింగ్ లుక్ లోకి మారిపోయాడు. జీరో ఫ్యాట్ బాడీని మెయింటెయిన్ చేసే ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా లావయ్యారు. సుధీర్ బాబు లేటెస్ట్ లుక్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాగా లావుగా మారిన సుధీర్ బాబును చూసి షాక్ అయిపోతున్నారు.  ఇంతకీ ఆయన అలా మారిపోవడానికి  కారణం ఏంటంటే...

రీసెంట్ గా సుధీర్ బాబు ‘హంట్’(Hunt) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో తన తదుపరి చిత్రాలపై బాగా ఫోకస్ పెట్టారు. విభిన్న కథలు ఎంచుకున్న ఆయన కొత్త లుక్స్ తోనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా నెక్ట్స్ ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra)లో నటిస్తున్నారు. చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  

తాజాగా ఈ చిత్రంలోని సుధీర్ బాబు మేకోవర్ కు సంబంధించిన ఓ వీడియోనే నెట్టింట వైరల్ అయ్యింది. డీవోపీ టెస్ట్ కోసం స్టూడియోకు వచ్చిన వీడియో క్లిప్ లో సుధీర్ బాబు చాలా లావుగా.. గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఈ కొత్త అవతారంతో ‘మామా మశ్చీంద్ర’లో ఎలా అలరిస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హర్ష వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ స్కేల్ లో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ యంగ్ హీరోల్లో సినిమా కోసం బాగా కష్టపడే హీరోల్లో సుధీర్ బాబు  ఒకరని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.  ఎప్పటికప్పుడు తన నటనలో మార్పులు చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. పదేండ్లకు పైగా తెలుగు ఆడియెన్స్ ను అలరించేందుకు వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఎస్ఎంఎస్’,‘ప్రేమ కథాచిత్రం’,‘సమ్మోహనం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  మిగతా చిత్రాలు సుధీర్ బాబుకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఇతా కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలా షాకింగ్ లుక్ లో మేకోవర్ అయ్యారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios