Asianet News TeluguAsianet News Telugu

శిక్ష పడాలి, రేణుక స్వామికి న్యాయం జరగాలి... దర్శన్ అరెస్ట్ పై సుదీప్ కీలక కామెంట్స్ 

హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామం కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేస్తోంది. దర్శన్ అరెస్ట్ పై స్టార్ హీరో సుదీప్ కీలక కామెంట్స్ చేశాడు. మృతుడు రేణుక స్వామి కుటుంబానికి, అతనికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలని ఆయన అన్నారు.. 
 

hero sudeepa sensational comments on kannada actor darshan arrest ksr
Author
First Published Jun 17, 2024, 12:27 PM IST

కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ శాండల్ వుడ్ ని కుదిపేస్తోంది. జూన్ 8న పోలీసులు ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా... మృతుడు చిత్రదుర్గానికి చెందిన రేణుక స్వామి అనే వ్యక్తి అని తేలింది. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హీరో దర్శన్ కి హత్య తో సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుక స్వామి అసభ్యకర సందేశాలు, ఫోటోలు పంపాడు. హీరో దర్శన్ కి రేణుక స్వామి మీద పవిత్ర గౌడ ఫిర్యాదు చేసింది. 

రేణుక స్వామిని కిడ్నాప్ చేయించిన దర్శన్ ఒక షెడ్ లో బంధించి, హింసించి చంపేశారు. దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 11 మందిని రేణుక స్వామి మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతుంది. దర్శన్ అరెస్ట్ పై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. 

ఆయన మాట్లాడుతూ... మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏం జరిగిందని అడగలేం కదా. అసలు నిజాలు వెలికి తీసేందుకు మీడియా, పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలుస్తోంది. హత్య చేయబడిన రేణుక స్వామికి, అతనికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి, అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ... దర్శన్ అరెస్ట్ కావడంతో నింద పరిశ్రమ మొత్తానికి ఆపాదిస్తున్నారు. పరిశ్రమకు న్యాయం జరగాలి. చిత్ర పరిశ్రమలో ఎందరో నటులు ఉన్నారు. పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదు. నిందితుడికి శిక్ష పడితే చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది... అన్నారు. సుదీప్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios