Asianet News TeluguAsianet News Telugu

ఆ సినిమా పోతుందని ముందే తెలుసు.. కానీ నటించడం తప్పలేదు.. హీరో శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు..

శ్రీరామ్‌ ఇప్పుడు `పిండం` చిత్రంతో రాబోతున్నారు. కానీ తాజాగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొందరు దర్శకుల గురించి షాకింగ్‌ కామెంట్‌ చేశారు.

hero sriram shocking thing revealed about his old movie incident arj
Author
First Published Dec 12, 2023, 11:14 PM IST

నటుడు శ్రీరామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన `షావ్‌కార్‌ పెట్టై` చిత్రం నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఫలితం ముందే తెలుసు అన్నారు. కానీ నటించక తప్పలేదన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఒకలా ఉందని, తెరపైకి రావడానికి మొత్తం మారిపోయిందని, ఫలితం తేడాగా వచ్చినా నటించక తప్పలేదన్నారు. తర్వాత ఘోర పరాజయం చవి చూడాల్సి వస్తుందన్నారు. ఒక హీరోగా తమకు ఆ బాధ్యత ఉంటుందని, హీరోగా అభిమానులకు మంచి సినిమా ఇవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని మన చేతుల్లో ఉండవన్నారు శ్రీరామ్‌. 

తాను నటించి ఓ సినిమాని ప్రస్తావిస్తూ .. ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు బాగుందని, కానీ మూడో రోజుకి తేడాగా అనిపించిందని, దీంతో ఈ సినిమా తాను చేయలేనని నిర్మాతకు చెబితే, అప్పటికే సినిమా బిజినెస్‌ అయిపోయిందని, ఇప్పుడు మీరు హ్యాండిస్తే, రోడ్డున పడతామని నిర్మాత వేడుకున్నాడని, దీంతో తప్పని పరిస్థితుల్లో సినిమా చేయాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి హీరోకి ఎదురవుతాయని, కానీ చూసి చూడనట్టు వెళ్లాల్సిందే, కొన్నింటికి ఏం చేయలేమన్నారు శ్రీరామ్‌. తనకు చాలా సినిమాల విషయంలో ఈ అనుభవం ఎదురయ్యిందన్నారు. కానీ తమ ఉద్దేశ్యం మాత్రం ప్రతిదీ మంచి సినిమా ఇవ్వాలనే అనుకుంటామన్నారు. 

ఇక ప్రస్తుతం ఆయన హీరోగా `పిండం` అనే చిత్రం రూపొందింది. సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించారు. ఖుషీ రవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని కళాహి మీడియా పతాకంపై యశ్వంత్‌ దగ్గుబాటి నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీరామ్‌.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక `పిండం` సినిమా గురించి చెబుతూ, `హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంటుంది. పేరుకి హారర్ సినిమా అంటారు.. కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తుంటారు. హారర్ జానర్ అంటే హారర్ ఉండాలి. థియేటర్ లో మనం చూసేటప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా పిండం కథ చెప్పగానే నచ్చింది. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఆయనకి ఎంతో క్లారిటీ ఉంది. సాయి కిరణ్ తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన ప్రతిభపై నమ్మకంగా కలిగింది. నిర్మాత యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా చేశారు. సినిమాని చూపించి బిజినెస్ చేసుకోగలిగారు. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన అసలైన హారర్ సినిమా. 

ఈ కథ 1930, 1990, ప్రస్తుతం ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. ఒక ఇల్లు, ఒక కుటుంబం అన్నట్టుగా సినిమా ఉండదు. ఇందులో చాలా కథ ఉంటుంది. పిండం టైటిల్ తో కూడా కథ ముడిపడి ఉంటుంది. నేను దర్శకుల నటుడిని. ఆ సన్నివేశంలో దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ రాత్రి అనే సినిమా తీశారు. నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన సినిమా అంటే అదే. ఆ సినిమాని ఎన్నో సార్లు చూశాను. పలు ఇంగ్లీష్ హారర్ సినిమాలు కూడా ఎన్నోసార్లు చూశాను. `పిండం` అనేది కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో బలమైన కథ ఉంటుంది. హార్రర్ సన్నివేశాల ఉండటమే కాకుండా.. ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా. నేను కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో చూడాలని ఎదురు చూస్తున్నాను. 

పిండం టైటిల్ కొందరు నెగటివ్ టైటిల్ అంటున్నారు. ఇది పాజిటివ్ టైటిల్. పుట్టుకలోనూ, చావులోనూ పిండం ఉంటుంది. తల్లి కడుపులో పెరిగే బిడ్డను పిండం అంటారు. అలాగే మనిషి చనిపోయాక వారి ఆత్మశాంతి కోసం పెట్టే భోజనాన్ని పిండం అంటారు. ఒకటి జీవితాన్ని ఇస్తుంది. ఇంకొకటి మరణం తర్వాత కూడా ఆనందాన్ని ఇస్తుంది.  అందుకే ఇది పాజిటివ్ టైటిల్. పైగా ఇది కథకి సరిగ్గా సరిపోయే టైటిల్` అని చెప్పారు శ్రీరామ్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios