`నిర్మలా కాన్వెంట్‌`, `పెళ్లి సందడి` చిత్రాలతో మెప్పించారు హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేకా. కొంత గ్యాప్‌ తో ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలతో రాబోతున్నారు. బర్త్ డే సందర్బంగా అవి ప్రకటించారు.

బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌. `నిర్మలా కాన్వెంట్‌`తో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. `పెళ్లిసందడి`తో పూర్తి స్థాయి హీరోగా మారారు. ఇప్పుడు కొంత గ్యాప్‌తో హీరోగా సినిమాలు ప్రకటించారు. ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించడం విశేషం. అందులో ఒకటి వేదాంస్‌ పిక్చర్స్ లో తెరకెక్కబోతుంది. రోషన్‌ పుట్టిన రోజు(మార్చి 13) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. 

ఈ సందర్భంగా వేదాంస్‌ యూనిట్‌ చెబుతూ, `బాలనటుడిగా `రుద్రమదేవి` (2015) చిత్రంలో తెరపై కనిపించాడు రోషన్‌. తర్వాత అతను ప్రధాన పాత్రలో తొలిసారి `నిర్మలా కాన్వెంట్ `(2016) లో నటించి ఉత్తమ నటుడిగా SIIMA అవార్డును గెలుచుకున్నారు. తర్వాత అతను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం `పెళ్లి సందడి`లో కథానాయకుడిగా నటించాడు. రోషన్ మేకా నటనలో ప్రవేశించే ముందు అధికారికంగా నటనలో శిక్షణ పొందింది. ముంబైలో.అతను బాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రోషన్ ఇప్పటికే తన లుక్స్, ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.`పెళ్లి సందడి` విజయం తర్వాత, రోషన్ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మా సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం` అ తెలిపారు. 

ఇక దీంతోపాటు పాపులర్‌ నిర్మాణసంస్థ వైజయంత్రి మూవీస్‌ బ్యానర్‌పై మరో సినిమా చేస్తున్నారు రోషన్‌. స్వప్ప సినిమాస్‌, వైజయంతి మూవీస్‌ కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. దీనికి `ఛాంపియన్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రదీప్‌ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని రోషన్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. పొడవాటి జుట్టు, లేత గెడ్డంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు రోషన్‌. పోస్టర్‌లో ఫుట్‌బాల్‌ కనిపిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సుధాకర్‌రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్‌గా, మిక్కీ జే మేయర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Scroll to load tweet…