Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యతో విలన్ గా అంటే భయపడ్డా.. 'అఖండ'పై అంచనాలు పెంచేసిన శ్రీకాంత్

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 2న అఖండ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

Hero Srikanth reveals interesting details about his role in Akhanda
Author
Hyderabad, First Published Nov 25, 2021, 4:09 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 2న అఖండ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. 

Srikanth కెరీర్ ఆరంభంలో నెగిటివ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా ఆఫర్స్ అందుకుంటూ ఫ్యామిలీ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం శ్రీకాంత్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇదే Boyapati Srinu దర్శకత్వంలోనే శ్రీకాంత్ సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ కి బాబాయ్ గా నటించారు. ఆ టైంలోనే బోయపాటి శ్రీకాంత్ కు అఖండ చిత్రంలో విలన్ రోల్ గురించి హింట్ ఇచ్చారట. 

ప్రతి రోల్ ని అంగీకరించకు. కెరీర్ విషయంలో ప్లాన్ చేసుకో. నీకు త్వరలోనే ఓ ఆసక్తికర పాత్ర గురించి చెబుతా అని బోయపాటి తనతో చెప్పినట్లు శ్రీకాంత్ అన్నారు. బోయపాటి చెప్పిన ఆ మాటలు అఖండ చిత్రంలో విలన్ రోల్ గురించే అని అన్నారు. ఈ చిత్రంలో వరద రాజుగా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. బోయపాటి సినిమాల్లో విలన్స్ భయంకరమైన లుక్ లో ఉంటారు. ఈ చిత్రంలో నా పాత్రలో నన్ను చూసుకున్నప్పుడు నాకే భయంగా అనిపించింది. 

ఈ చిత్రంలో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. Balakrishna తో శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా నటించా. ఇప్పుడు విలన్ గా చేస్తున్నా అని శ్రీకాంత్ అన్నారు. బాలయ్య డైలాగ్స్ ఈ చిత్రంలో మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి. ఇక బాలకృష్ణ అఘోరి పాత్ర గురించి శ్రీకాంత్ ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రకృతితో పోరాడే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు. 

ఇక కెరీర్ లో తాను తొలిసారి రేప్ సన్నివేశంలో నటించినట్లు శ్రీకాంత్ రివీల్ చేశారు. ఈ సన్నివేశాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే చిన్న టెన్షన్ ఉందని చెప్పారు. ఇటీవల అకాల మరణం చెందిన పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ లో తాను విలన్ గా నటించినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆ చిత్రంలో కూడా తన రోల్ బావుంటుందని చెప్పారు. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన 'పెళ్లి సందD' చిత్రం ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. ఆ చిత్ర రిలీజ్ కు ముందు కాస్త టెన్షన్ పడ్డట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. 

Also Read: చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం, అర్థం చేసుకోండి... సీఎం జగన్ కి చిరు విజ్ఞప్తి

Follow Us:
Download App:
  • android
  • ios