విజయ్ దేవరకొండ, నాని, అల్లరి నరేష్ కు శ్రీకాంత్ ఛాలెంజ్(ఫొటోస్)
శ్రీకాంత్ నటించిన తాజా చిత్రం మార్షల్. ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల శ్రీకాంత్ సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ నటిస్తున్నాడు. క్యారెక్టర్ రోల్స్ లో సైతం రాణిస్తున్నాడు.

హీరో శ్రీకాంత్ తాజాగా ఓ సామజిక కార్యక్రమం ద్వారా వార్తల్లో నిలిచాడు. తెలంగాణాలో గత ఏడాది హరిత హారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగింది. సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా చెట్లు నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాంత్ హరిత హారం కార్యక్రమంలో భాగంగా వనమిత్ర అవార్డుని అందుకున్నాడు.
ఈ సందర్భంగా మరోసారి శ్రీకాంత్ మొక్కలు నాటాడు. తనని ఈ మంచి కార్యక్రమంలో పోత్సాహించిన టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ గారు ఓ ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు శ్రీకాంత్ ప్రశంసించాడు.
ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు ఈ రోజు మొక్కలు నాటా. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, నాని, అల్లరి నరేష్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నా అని శ్రీకాంత్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. శ్రీకాంత్ మొక్కలు నాటుతున్న ఫోటోలు ఈ కింద చూడవచ్చు.