దళపతి విజయ్ సినిమాకు శింబు సాయం, సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారా..?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా కోసం మరో తమిళ హీరో శింబు సహాయం తీసుకోబోతున్నారట. శింబును లక్కీగా ఫీల్ అయ్యారో ఏమో తెలియదు కాని.. ఆయన హ్యాండ్ పడితే చాలు అనుకున్నట్టున్నారు. ఇంతకీ శింబుని ఏ విధంగా వాడబోతున్నారంటే..?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా కోసం మరో తమిళ హీరో శింబు సహాయం తీసుకోబోతున్నారట. శింబును లక్కీగా ఫీల్ అయ్యారో ఏమో తెలియదు కాని.. ఆయన హ్యాండ్ పడితే చాలు అనుకున్నట్టున్నారు. ఇంతకీ శింబుని ఏ విధంగా వాడబోతున్నారంటే..?
వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు దళపతి విజయ్. అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది మనోడికి. దాంతో టాలీవుడ్ డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు స్టార్ హీరో. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వారసుడు టైటిల్ తో రూపొందిన ఈసినిమా తమిళంలో వారీసు టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. ఇక ఈమూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ అటు తమిళ, ఇటు తెలుగు ఫిల్మ్ సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ పాట కోసం తమిళ హీరో శింబును సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ పెప్పీ సాంగ్‌ను శింబుతో పాడిపించనున్నారట. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇక ఇప్పుడు వారసడు సినిమాకు పాడబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సాంగ్ తమిళ వర్షన్ కే పరిమితం అవుతుందా.. లేక తెలుగులో కూడా శింబు చేతే పాడిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ పాట కోసం తమన్ ట్యూన్‌ను కూడా రెడీ చ చేసినట్లు టాక్. ఇక ఇటీవలే శింబు ది వారియర్‌లో బుల్లెట్ సాంగ్ పాడిన విషయం తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భఉతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు వారసుడిలో శింబుతో సాంగ్‌ను పాడించాలని మూవీ టీమ్ అనుకుంటుందట.
ఇక తమన్ మ్యూజిక్ చేస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇక ఈమూవీపై రీసెంట్ గా ఓ వివాదం కూడా నడిచింది. తమిళ సినిమా - తెలుగు సినిమాల మధ్య ఇప్పటికీ ఈ మూవీ కారణంగా నివురుగప్పిన నిప్పు అలాగే ఉంది. మరి ఈ సినిమా రిలీజ్ టైమ్ కు అది రాజుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.