డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ వ్యవహారం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క హిట్ కే ఈ యంగ్ ఫెలో పైకి చూస్తున్నాడు అంటున్నారు. డీజే టిల్లు స్క్వేర్ మూవీ నుండి హీరోయిన్స్ తప్పుకోవడానికి ఆయనే కారణమన్న మాట వినిపిస్తోంది.  

సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. అయితే ఆ కిక్ తలకెక్కితే మాత్రం కష్టం. విజయాలకు పొంగకుండా అపజయాలకు క్రుంగకుండా ఉండగలడం గొప్ప విషయం. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ హ్యాంగ్ ఓవర్ లో కొంచెం అతి చేస్తున్నాడని పరిశ్రమలో వినిపిస్తుంది. మనోడి తీరు నచ్చక డీజే టిల్లు స్క్వేర్ మూవీ ప్రమాదంలో పడుతుందట. వరుసగా ఆ ప్రాజెక్ట్ నుండి హీరోయిన్స్ తప్పుకోవడానికి సిద్ధు ప్రవర్తనే కారణం అంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాలీవుడ్ సెన్సేషనల్ హిట్స్ లో డీజే టిల్లు ఒకటి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన డీజే టిల్లు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. డీజే టిల్లు సక్సెస్ నేపథ్యంలో దానికి సీక్వెల్ ప్రకటించారు. డీజే టిల్లు స్క్వేర్ టైటిల్ గా నిర్ణయించారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుండి హీరోయిన్స్ ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. 

మొదట పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలను అనుకున్నారు. ప్రాజెక్ట్ కి సైన్ చేసిన శ్రీలీల మధ్యలో చేయనని వెళ్లిపోయారు. శ్రీలీల తప్పుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా చేసిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ప్రాజెక్ట్ నుండి వాక్ అవుట్ చేశారు. దీంతో మరో మలయాళీ హీరోయిన్ మడోనా సెబాస్టియన్ ని తీసుకున్నారు. హీరోయిన్స్ ఒక్కొక్కరిగా వెళ్లిపోవడానికి హీరో సిద్ధు ఓవర్ యాటిట్యూడ్ కారణం అంటున్నారు. సెట్స్ లో అన్నీ తానై వ్యవహరిస్తూ, అందరూ తన మాటే వినాలన్నట్లు ప్రవర్తిస్తున్నాడట.

ఆయన ప్రవర్తన నచ్చని హీరోయిన్స్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నారట. ఇక డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకుడిగా ఉన్నాడు. సీక్వెల్ నుండి ఆయన్ని తప్పించారు. డీజే టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకుడు. ఈ రెండు చిత్రాలకు సిద్ధు రచయిత కూడాను. మొత్తంగా ఒక్క హిట్ పడగానే సిద్ధు స్టార్ హీరోలా ఫీల్ అవుతూ పైకి చూస్తున్నాడనే మాట వినిపిస్తోంది.