సారాంశం
రిపోర్టర్ పై సీరియస్ అయ్యారు తమిళ స్టార్ హీరో సిద్థార్ధ్.. ప్రేమ గురించి పర్సనల్ విషయాలు అడిగినందకు ఆయన ముఖంలో ఒకింగత కోపం వచ్చినా.. అది కనిపించకుండా కవర్ చేశారు సిద్ధార్ద్ ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
ఎంతటి స్టార్ అయినా.. మీడియా మీట్ లలో వారికి ఇబ్బంది కర ప్రశ్నలు తప్పవు. సినిమాల విషయంలో కాని.. పర్సనల్ గా కాని.. సూటి ప్రశ్నలు మీడియా నుంచి ఎదుర్కొంటూ ఉంటారు సెలబ్రిటీలు. ఇక వారు అడిగిన ప్రశ్నకు కొంత మంది కూల్ గా సమాధానం చెపితే.. మరికొంత మంది ఆవేశంతో ఊగిపోతుంటారు. ఇంకొంత మంది మాత్రం ఆ సమయంలో అసలు స్పందించకుండా కామ్ గా ఉంటూ.. తెలివిగా ప్రవర్థిస్తారు. ఇంకొంత మంది స్టార్లు అయితే.. కోపాన్ని పంటికింద దాచిపెట్టి.. కూల్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. కాని ఈ విషయంలో మాత్రం వెంటనే దొరికిపోతారు.
ఇక ఈసారి హీరో సిద్థార్ద్ వంతు వచ్చింది. మీడియాకు దొరక్క దొరక్క దొరికాడు.. అసలే అదితి రావు తో అఆలు చదువుకుంటున్న సిద్దు.. రిపోర్టర్ల చేతికి అప్పనంగా దొరికాడు. తన వ్యక్తిగత జీవితంపై ఒక తెలుగు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సిద్ధార్థ ఎంతో చక్కగా స్పందించాడు. సిద్ధార్థ నటించిన టక్కర్ సినిమా తమిళం, తెలుగులో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గోంటున్నారు సిద్దు. ఇక తెలుగు ప్రమోషన్స్ కోసం రీసెంట్ గా దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.
ఓ రిపోర్టర్ మైక్ పుచ్చుకుని, అదితి రావు హైదరితో సిద్ధార్థ డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లను ప్రస్తావించాడు.మీరు సినిమాల్లో.. లవ్‌లో సక్సెస్‌ఫుల్ హీరో. కానీ, రియల్‌గా లవ్‌లో సక్సెస్ ఫుల్ హీరో కాదు మీరు. అది మీరు ఎప్పుడైనా అనుకున్నారా?.. అంటూ ఉండగానే సిద్దార్థ్ స్పందిస్తూ.. మళ్లీ ఇలాంటి కామెంట్రీ అద్దం చూసి గానీ, నిద్రపోతున్నపుడు నామైండ్‌లో.. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ, రియల్ లైఫ్‌లో నేను ఎలా ప్రేమిస్తున్నానన్న దాని గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు కాబట్టి.. మీరు నేను పర్సనల్‌గా కూర్చుని బయట మాట్లాడదాం. వీళ్లకు దానికి సంబంధమే లేదు. టక్కర్ సినిమాకు అస్సలే సంబంధం లేదు కాస్త ఘాటుగా... స్వీట్ గా చెప్పేశారు సిద్దార్థ్.
సిద్ధార్థ్ - అదితీ రావు హైదరీతో ప్రేమలో ఉన్నాడని.. వారిద్దరు డేటింగ్‌లో బిజీగా ఉన్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటం.. వారి వీడియోలు, పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఇద్దరూ తమ రిలేషన్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మహా సముద్రం సినిమా టైమ్ నుంచి ఇద్దరి మధ్యా రిలేషన్ పెరిగి పెద్దదైనట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టక్కర్ సినిమా చేస్తున్నాడు సిద్థార్థ్ తెలుగులో కూడా ఈసినిమాకు గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాకి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది.