ఎప్పుడూ ఏదో ఒక కామెంట్స్ తో వివాదాల్లో చిక్కుకుంటుంటాడు హీరో సిద్ధార్థ్. రీసెంట్ గా మరోసారి షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి సిద్దు ఎవరిని విమర్షించారు.
బొమ్మరిల్లు సినిమాతో తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు హీరో సిద్థార్ధ్. ఆతరువాత వరుసగా తెలుగు అవకాశాలు కొట్టేసి సిద్ధు.. ఎక్కువగా ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసి.. టాలీవుడ్ కు చాలా కాలం దూరం అయ్యాడు సిద్థు. రీసెంట్ గా మహాసముద్రం సినిమా తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. అది కూడా వర్కౌట్ కాలేదు పాపం.
ఎప్పుడూ ఏదో వివాదంలో తలదూరుస్తూ.. ఇబ్బందులు కొనితెచ్చుకునే సిద్ధార్ధ్ ఆమధ్య సైనా నెహ్వాల్ పై చేసిన కామెంట్ భారీ వివాదానికి దారి తీశాయి. దాంతో సారీ చెప్పక తప్పలేదు సిద్ధు. ఇక ఈ మధ్య మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కడు సిద్ధు. అయితే సారి మాత్రం ఎవరిగురించో కాదు.. తనపై తానే సెటైర్స్ వేసుకున్నాడు.
ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ తాను సినిమాల్లో నటిస్తానన్నాడు సిద్థు... , ఒకవేళ అటువంటి అవకాశాలు రానప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కుంటానని అందరికి షాక్ ఇచ్చాడు సిద్ధార్థ్ చెప్పాడు. నటుడిగా నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువగా సౌత్ సినిమాల్లోనే నటించానంటున్నాడు సినియర్ హీరో.
అయితే తాను ఎక్కువగా సౌత్ సినిమాలు చేయడం వల్ల చాలామంది తాను సౌత్ ఇండియా అనుకుంటారని.. కాని తానుఢిల్లీకి చెందిన వ్యక్తినన్న విషయాన్ని అంతా మర్చిపోయారని ఆయన తెలిపాడు. తాను హిందీ చాలా బాగా మాట్లాడతానని, ఆసక్తికరమైన పాత్రలు వచ్చినప్పుడు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నానని అన్నాు.
ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్ సిరీస్ మే 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఓకే చేశాననన్నాడు సిద్ధార్థ్. ఇతక టాలీవుడ్ లో మరోసారి అవకాశం వస్తే.. అదృష్టం పరిక్షించుకోవాలని చూస్తున్నాడు.
