సిద్ధార్థ్-అదితి రావ్ హైదరి రిలేషన్శిప్ లో ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. దాన్ని బలపరుస్తూ ఈ జంట కలిసి డాన్స్ వీడియో చేశారు.
కోలీవుడ్ మన్మధరాజాల్లో సిద్ధార్థ్ ఒకడు. మనోడు ఇప్పటికే అనధికారికంగా ముగ్గురు నలుగురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారు. తాజాగా హీరోయిన్ అదితిరావ్ హైదరితో రిలేషన్ పెట్టుకున్నాడనేది పరిశ్రమ వర్గాల వాదన. తరచుగా కలిసి కనిపిస్తున్న ఈ జంట... సోషల్ మీడియాలో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ రూమర్స్ ని బలపరుస్తూ మరో చర్యకు పాల్పడ్డారు. విశాల్ చిత్రంలోని ట్రెండీ సాంగ్ కి కలిసి స్టెప్స్ వేశారు. ఈ ఇంస్టాగ్రామ్ రీల్ అదితి తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో సిద్ధార్థ్-అదితి ఎఫైర్ మరోసారి చర్చకు వచ్చింది.
2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. విబేధాలు రావడంతో 2007లో విడిపోయాడు. సిద్ధార్థ్ మరో వివాహం చేసుకోలేదు. ఇక అదితిరావ్ హైదరికి సైతం విడాకులయ్యాయి. చిన్న వయసులో రహస్య వివాహం చేసుకున్న అదితిరావ్... ఎవరికీ తెలియకుండా విడాకులు తీసుకున్నారు. ఇక సిద్దార్థ్-అదితి కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం చిత్రంలో నటించారు. శర్వానంద్ మరో హీరోగా నటించిన ఆ చిత్రం ఆడలేదు.
మహాసముద్రం సెట్స్ లోనే ఇద్దరికీ జతకుదిరిందని సమాచారం. అధికారికంగా తమ రిలేషన్ ప్రకటించకున్నప్పటికీ... పరోక్షంగా హింట్ ఇస్తున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సిద్ధార్థ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం భారతీయుడు 2 మూవీలో సిద్ధార్థ్ కీలక రోల్ చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అదితిరావు హైదరి పరిస్థితి కూడా అలానే ఉంది. వరుస ఫెయిల్యూర్స్ తో ఆమె కెరీర్ నెమ్మదించింది.
