క్రాక్ మూవీతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు హీరో రవితేజ. రవితేజ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోగా, రవితేజ పనైపోయిందని పరిశ్రమలో టాక్ మొదలైపోయింది. ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఘనంగా ప్రకటించారు రవితేజ. సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ రికార్డు కలెక్షన్స్ అందుకోవడంతో పాటు రవితేజ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రవితేజ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.

మీరు అందించిన విజయానికి కేవలం కృతఙ్ఞతలు సరిపోవు అంటూ రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే నేటి నుండి ఆహాలో యాప్ లో క్రాక్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్స్ లో మిస్సైన వారు చూసి ఎంజాయ్ చేయాలని ఆయన కోరుకోవడం జరిగింది. అల్లు అరవింద్ ఫ్యాన్సీ ప్రైస్ కి క్రాక్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నారు. దాదాపు రూ. 8కోట్లకు పైగా క్రాక్ డిజిటల్ రైట్స్ అమ్ముడుబోయినట్లు సమాచారం.

రవితేజ పోలీస్ అధికారిగా నటించగా శృతి హాసన్ ఆయన భార్య పాత్ర చేయడం విశేషం. సినిమాలో కీలకమైన విలన్ పాత్రలను సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించారు. ఈ రెండు పాత్రలు క్రాక్ లో హైలెట్ గా నిలిచాయి. ఠాగూర్ మధు క్రాక్ చిత్రానికి నిర్మాత కాగా, థమన్ సంగీతం అందించారు.