Asianet News TeluguAsianet News Telugu

రవితేజ కొడుకు హీరోగా ఇడియట్ 2... క్లారిటీ ఇచ్చిన మాస్ మహరాజ్!

ఇడియట్ కి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. ఇడియట్ మూవీ సీక్వెల్ తో  రవితేజ తన కుమారుడు మహదాన్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దీనిపై రవితేజ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. 

hero raviteja clarifies idiot sequel with his son mahadhan
Author
First Published Dec 28, 2022, 10:35 AM IST


రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఇడియట్. 'నీ కోసం' సినిమాతో హీరోగా మారిన రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీతో మొదటి హిట్ పడింది. దర్శకుడు వంశీ తెరకెక్కించిన అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కూడా మంచి విజయం సాధించింది. అయితే రవితేజకు స్టార్డమ్, ఫాలోయింగ్ తెచ్చిన మూవీ ఇడియట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజకు ఇది రెండో చిత్రం. 2002లో విడుదలైన ఇడియట్ సూపర్ హిట్ కొట్టింది. మూస ధోరణిలో సాగే ప్రేమకథలకు భిన్నంగా ఇడియట్ తెరకెక్కింది. అప్పట్లో ఇది న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. 

ఇడియట్ అనే తిట్టును టైటిల్ గా పెట్టడం ఒక సాహసం. ఇక ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా రాసుకున్నారు. ఒక మిడిల్ క్లాస్ యంగ్ ఫెలో యాటిట్యూడ్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. కామెడీ, ఎమోషన్స్, లవ్ కలగలిపి పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఇడియట్ ని పూరి జగన్నాధ్ తీర్చిదిద్దారు.  పూరి, రవితేజ కెరీర్స్ కి ఇడియట్ మంచి పునాది వేసింది. ముఖ్యంగా రవితేజ హీరోగా నిలదొక్కున్నాడు. 

కాగా ఇడియట్ కి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. ఇడియట్ మూవీ సీక్వెల్ తో  రవితేజ తన కుమారుడు మహదాన్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దీనిపై రవితేజ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి... ఇడియట్ సీక్వెల్ తో మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట నిజమేనా? అని అడగడం జరిగింది. 

ఈ వార్తల్లో నిజం లేదు. ఇడియట్ సీక్వెల్ మా అబ్బాయితో చేసే ప్రణాళిక లేదు, వినడానికే ఇది కొత్తగా ఉందని రవితేజ చెప్పుకొచ్చారు. మహదాన్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు అనిల్ రావిపూడి అతన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు. రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన రాజా ది గ్రేట్ మూవీలో చిన్నప్పటి రవితేజ పాత్రను మహదాన్ చేశాడు. అంధుడిగా అతడు నటించి మెప్పించాడు. హీరోల వారసులు హీరోలు కావడం ఖాయం కాబట్టి. ఇడియట్ సీక్వెల్ తో కాకపోయినా... త్వరలో మహదాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనివార్యం. లేటైనా రావడం పక్కా. ప్రస్తుతం మహదాన్ టీనేజ్ లో ఉన్నాడు. కోరమీసం రాగానే రంగంలోకి దిగుతాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios