ఎప్పుడూ ఏ వివాదాల జోలికి వెళ్లని రానా దగ్గుబాటి మొట్టమొదటి సారి కోర్టు మెట్లు ఎక్కారు. ఓ స్థలం వివాదంలో చిక్కుకున్న రానా కోర్టు విచారణకు హజరయ్యారు. ఇంతకీ ఏంటా వివాదం..?
ఎప్పుడూ ఏ వివాదాల జోలికి వెళ్లని టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఓ వివాదం విషయంలో మంగళవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఓ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లో గతంలో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు మంగళవారం రానా కోర్టు విచారణకు హాజరయ్యాడు. దగ్గుబాటిఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి దగ్గుబాటి ఫ్యామిలీని ఓ స్థల వివాదం చుట్టుముట్టింది.
వివరాలు చూస్తే.. ఓ వ్యాక్తి తనను దగ్గుబాటి కుటుంబం మోసం చేసిందంటూ.. కోర్టును ఆశ్రయించాడు. ఫిల్మ్ నగర్ లో దగ్గుబాటివారికి రెండు వేల గజాలకు పైగా స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2014లో ఓ వ్యక్తికి ఓ సంస్థ నిమిత్తం లీజుకు ఇచ్చారు. అయితే ఈ స్థలం రానాతో పాటు వెంకటేష్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈస్థలం లీజు టైమ్ పూర్తి అవ్వకముందే తమను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
అంతే కాదు.. తమకు తెలియకుండా.. అందులో 1000 గజాల స్థలాన్ని రానా పేరుమీద రిజిస్టేషన్ చేసినట్టు.. ఆ వ్యాక్తి ఆరోపిస్తున్నారు. అయితే లీజు టైమ్ అయిపోయినందునే రానా ఫ్యామిలీ ఆస్థలం విషయంలో ముందడుగు వేసినట్టు రానా ఫ్యామిలీ నుంచి సమాచారం వస్తోంది. ఈ విషయమై నోటీసులు అందగా రానా కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.
