Asianet News TeluguAsianet News Telugu

దగ్గుబాటి వారి పెళ్లి సందడి, రావణ రాజ్యంలో రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుకలు....?

టాలీవుడ్ లో అతి పెద్ద  సినిమా ఫ్యామిలీగా ఉన్న దగ్గుబాటివారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్నకొడుకు అభిరామ్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు. పెళ్ళికి అన్నిసన్నాహాలుజరిగిపోతున్నాయి. ఇంతకీ వేడుకలు ఎక్కడంటే..?  

Hero Rana Brother Daggubati Abhiram Wedding In Sri Lanka JMS
Author
First Published Dec 3, 2023, 7:52 AM IST

తెలుగు సినిమా పరిశ్రమలో అతి పెద్ద సినిమా ఫ్యామిలీ అంటే దగ్గుబాటి ప్యామిలీని ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఫ్యామిలీలో ప్రొడ్యూసర్లు,హీరోలు,దర్శకులు, అందరూఉన్నారు. ఇక దగ్గుబాటివారసులుగా ఇప్పటి తరంలో రానా లీడ్ చేస్తుండగా.. అతని తమ్ముడు అభిరామ్ రీసెంట్ గా  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ యంగ్ హీరో వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అది కూడా ఇండియాలో కాదు  శ్రీలంకలో.

టాలీవుడ్ సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్  బాబు చిన్న కుమారుడు.. హీరో రానా దగ్గుబాటి తమ్ముడైన అభిరామ్ దగ్గుబాటి పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు రుగుతున్నాయి. ఈనెల అనగా డిసెంబర్ 6న పెళ్లి వేడుకలకు అంతా సిద్దం అయినట్టు తెలుస్తోంది. అయితే అభిరామ్ డెస్టినీవెడ్డింగ్ ను చేసుకోబోతున్నాడు. అంతే కాదు.. అందరుసెలబ్రిటీల్లా.. ఏఇటలీనో, ఇంగ్లాండో కాకుండా.. అభిరామ్ వివాహం శ్రీలంకలో ప్లాన్ చేశారు. శ్రీలంకలోఫైవ్ స్టార్ రిసార్ట్ అయిన అనంతర కలుతారాలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. 

 టాలీవుడ్ లోని వివిధ వర్గాల నుంచి అందుతున్న  సమాచారం ప్రకారం డిసెంబర్ 6న రాత్రి 8 గం.ల 50 ని. లకు ప్రత్యూష చపరాల మెడలో అభిరామ్ దగ్గుబాటి మూడు ముళ్లు వేయబోతున్నట్టు సమాచారం. ఈ వేడుకలకు దాదాపుగా 200 మందికి పైగా అతిధులు హాజరవుతారని సమాచారం.  ఇరు వర్గాల  బందుమిత్రులు,  సినీ,రాజకీయ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో సందడి చేయబోతున్నారు.  అయితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అతిథులు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు. 

ఈ పెళ్ళి వేడుకలను మూడు రోజులు జరపబోతునారట. సోమవారం రాత్రి పార్టీతో స్టార్ట్ అయ్యి..సంగీత్.. ఆతరువాత  మంగళవారం సాయంత్రం  మెహందీ వేడుక, అనంతరం విందు ఏర్పాటు చేస్తారు.ఇక బుధవారం ఉదయం 10:30 గంటలకు పెళ్లికూతురు వేడుక నిర్వహించి అనంతరం సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని సమాచారం.  రాత్రి 8:50 గంటలకు సుముహూర్తాన్ని నిర్ణయించారట. 

పెళ్ళి తరువాత వెంటనే.. వీరు  హైదరాబాద్‌ రానున్నారు. ఇక్కడ  దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అతిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తేజా డైరెక్షన్ లో అహింస సినిమాలో అతను నటించారు. ముందు ముందు హీరోగా మరిన్నిసినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios