Asianet News TeluguAsianet News Telugu

రామ్‌ రెండు రకాలుగా నలిగిపోతున్నాడట!

ఇప్పుడు కులం గురించి మాట్లాడిన రామ్‌.. ఇండస్ట్రీలో ఉన్న కులాల పోరు గురించి ఎందుకు మాట్లాడటం లేదనే కామెంట్‌ నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో వేళ్లూనుకున్న కుల గజ్జి గురించి ఎందుకు స్పందించడం లేదని పలువురు క్రిటిక్స్ సైతం అంటున్నారు. 

hero ram suffers from two types of problems
Author
Hyderabad, First Published Aug 20, 2020, 2:36 PM IST

వివాదాలకు అతీతంగా, పూర్తి ప్రైవేట్‌ జీవితం గడిపే టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌  అయిన విషయం  తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై స్పందించి తన బాబాయ్‌ రమేష్‌ ప్రసాద్‌కి మద్దతుగా నిలిచే క్రమంలో పలు విమర్శలు చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కి విన్నవిస్తూ, `మీ కింద కుట్రలు జరుగుతున్నాయ`ని ట్వీట్‌ చేశాడు. ఇది పెద్ద దుమారాన్నే రేపింది. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి, కారకులకు సపోర్ట్ చేయడాన్ని వైసీపీ నాయకులు, నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. తన తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గాడు రామ్‌. 

అయితే తనపై కులాన్ని అంటగట్టడంపై రామ్‌ సీరియస్‌ అయ్యారు. కరోనా కంటే కులం ప్రమాదకారిగా మారిందని మరో సెన్సేషనల్‌ ట్వీట్‌ చేశారు. ఇది మరింత దుమారాన్ని రేపుతుంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లేదన్నాడు. దీంతో ఇదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఇదిలా ఉంటే ఇప్పుడు కులం గురించి మాట్లాడిన రామ్‌.. ఇండస్ట్రీలో ఉన్న కులాల పోరు గురించి ఎందుకు మాట్లాడటం లేదనే కామెంట్‌ నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో వేళ్లూనుకున్న కుల గజ్జి గురించి ఎందుకు స్పందించడం లేదని పలువురు క్రిటిక్స్ సైతం అంటున్నారు. దీంతో రామ్‌ మరో రూపంలో ఇరుక్కుపోయినట్టయ్యింది. 

ఇదంతా ఓ ఎత్తైతే.. తాను నటించిన `రెడ్‌` సినిమా సైతం చికాకు పెడుతుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. అయితే కరోనా వల్ల థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో `రెడ్‌` చిత్రానికి కూడా ఓటీటీల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. బడ్జెట్‌ కంటే ఎక్కువే ఇచ్చేందుకు ఓ ఓటీటీ ముందుకు రాగా, నిర్మాత స్రవంతి రవికిషోర్‌ దాన్ని తిరస్కరించారట. థియేటర్‌లోనే రిలీజ్‌ చేయాలని భావించారు. 

కానీ వడ్డీలు పెరిగిపోతున్నాయి, థియేటర్లు ఓపెన్‌ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతుండగా, అది తక్కువ రేట్‌కి కోట్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు రవికిషోర్‌. దీంతో రామ్‌ ఓ వైపు పొలిటికల్‌ ఇష్యూస్‌తో, మరోవైపు తన సినిమా రిలీజ్‌ ఇష్యూస్‌తో నలిగిపోతున్నట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios