ప్రపంచ వ్యాప్తంగా రష్యా - ఉక్రెయిన్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఉక్రెయిన్ పై రష్యా చర్యలను అన్ని దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. అక్కడ చిక్కుకున్న భారత పౌరులు, ఇతర దేశస్తుల పరిస్థితి దారుణంగా ఉంది. దీనిపై హీరో రామ్ పోతినేని ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో (Russia-Ukraine war) తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస దాడులతో రష్యా ఉక్రెయిన్ లోని ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఇతర దేశాలు కూడా ఉక్రెయిన్ కు సైనిక బలాన్ని, ఆయుధ బలాన్ని అందించి సహకరిస్తున్నాయి. రష్యా చర్యలను ప్రతిఘటిస్తూ.. ఉక్రెయిన్ ను మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ లో 24 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో 300 మందికి పైగా తెలుగు వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సర్వదా క్రుషి చేస్తోంది. ఇప్పటికే 1300కు పైగా భారత పౌరులను తీసుకొచ్చినట్టు సమాచారం. ఇటీవల ఉక్రెయిన్‌కు నుంచి రొమేనియాకు చేరుకున్న 219 మంది భారతీయులతో కూడిన విమానం ముంబైకి చేరుకుంది. మిగిలిన వారిని కూడా సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
అయితే ఇతర దేశాలు.. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. తమ సైనిక బలాన్ని ఉక్రెయిన్ యుద్ధ భూమికి తరలిస్తున్నాయి. రష్యాకు బుద్ధి చెప్పేందుకు పోరాడుతున్నాయి. అయితే ఈ చర్యపై హీరో రామ్ పోతినేని ట్విట్టర్ వేదికన స్పందించారు. ‘యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు సరైన విధంగా తమ డ్యూటీ నిర్వర్తించాల్సింది’ అంటూ ట్వీట్ చేశాడు. ఉక్రెయిన్ - రష్యా వార్ త్వరగా ముగియాలని, ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్స్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించాడు. బాధితుల కోసం ప్రేయర్ చేయాలని సూచించాడు.
ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ మూవీలో నటిస్తున్నారు. పవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రామ్ తన న్యూ లుక్ తో ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్, రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి రెస్సాన్స్ ను అందుకుంటున్నాయి. కృతి శెట్టి విజిల్ మహా లక్షి పాత్రలో రామ్ సరసన ఆడిపాడనుంది. చిత్తూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ లో మూవీని రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేస్తున్నారు మేకర్స్.
