అదే పోలీస్‌, అదే విలన్‌! కానీ, ఒక సోల్‌ ఉంటుంది. పోలీస్‌ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేది సినిమాకి మెయిన్‌ అవుతుంది. ‘ది వారియర్‌’లో ఆ సోల్‌, ఎమోషన్‌ నాకు బాగా నచ్చాయి. ‘మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?’ అని అడిగితే ‘కొంత మంది రియల్‌ పోలీస్‌ ఆఫీసర్లను చూసి కథ రాశా’ అని చెప్పారు లింగుస్వామి. 

హీరో రామ్‌ (Ram) పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది..బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎంత రాబట్టాలి అనే విషయమై ట్రేడ్ లో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మాకు అందుతున్న వివరాల మేరకు ప్రీ రిలీజ్ బిజనెస్ లెక్కలు అందిస్తున్నాం. 

తెలంగాణా- 11.00cr

రాయలసీమ - 06.00cr

కోస్తాంధ్ర & ఉత్తరాంధ్ర - 17.00cr

రెండు తెలుగు రాష్ట్రాల థియోటర్ బిజనెస్ - 34.00cr

కర్ణాటక +భారత్ లో మిగిలిన ప్రాంతాలు - 02.00cr

ఓవర్ సీస్ – 02.10cr

తమిళ వెర్షన్ - 05.00

మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ - 43.10cr

వరల్డ్ వైడ్ షేర్ బ్రేక్ ఈవెన్ – 44.00cr


ఇప్పటిదాకా మొత్తం థియోటర్స్ కౌంట్

తెలంగాణా - 250

రాయలసీమ - 145

ఆంధ్రా - 300

తెలుగు రాష్ట్రాలు మొత్తం - 700

కర్ణాటక +తమిళం +దేశంలో మిగతా ప్రాంతాలు 230

ఓవర్ సీస్ - 350
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న థియోటర్స్ సంఖ్య- 1280 


రామ్ మాట్లాడుతూ... ఇస్మార్ట్‌ శంకర్‌లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ఫెయిల్యూర్స్‌లో ఉన్న లింగుస్తామితో సినిమా చేయడం గురించి కూడా చాలామంది కామెంట్లు చేశారు. నేను అలాంటి లెక్కలు వేసుకుంటే ఇస్మార్ట్‌ శంకర్‌ కూడా చేసేవాడిని కాదు. పూరి జగన్నాథ్‌ గారు, లింగుస్వామి ఇద్దరూ ట్రెండ్‌ సెట్టర్స్‌. వేరే కథలు గురించి చర్చలు జరుపుతున్నప్పుడు ఆ కథలు కనెక్ట్‌ కాలేదు గానీ... వాళ్ళ బ్రిలియన్స్‌ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్‌ అయ్యి కరెక్ట్‌ స్క్రిప్ట్‌ పడితే రిజల్ట్‌ బావుంటుంది. లింగుస్వామి గారు కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్‌ అయ్యాం. ఈ స్క్రిప్ట్‌ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్‌ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్‌ లాంటి వాళ్ళు. ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది అన్నారు.