తెలుగు సినిమాలకు నార్త్ ఆడియన్స్ ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. డిజిటల్ మీడియా యుగం రావడంతో కేవలం థియేటర్స్ లో మాత్రమే కాక అనేక ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాని చూసే అవకాశం అభిమానులకు లభిస్తోంది. దీనితో నార్త్ ఆడియన్స్ కి  సౌత్ లో క్రేజ్ ఉన్న హీరోలందరి సినిమాలు హిందీ ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయి. 

యూట్యూబ్ లో ధనుష్, సైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రాలు, పాటలు వందల మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాము. మంచి బజ్ ఉన్న తెలుగు సినిమాలన్నింటినీ హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో రామ్ అరుదైన ఘనత సాధించాడు. 

రామ్ నటించిన రీసెంట్ మూవీస్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే హిందీ వెర్షన్స్ యూట్యూబ్ లో వరుసగా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించాయి. దీనిపై హీరో రామ్ ట్వీట్ చేస్తూ.. నాపై పిచ్చి ప్రేమ చూపిస్తున్న మీరు అందరికి థాంక్యూ. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా అని ట్వీట్ చేశాడు. 

హీరో రామ్ ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్ లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఒకటిగా నిలిచింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.