ప్రస్తుతం దేశమంతటా.. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది

ప్రస్తుతం దేశమంతటా.. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ తము కసరత్తులు చేసిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి హీరో రామ్ కు ఛాలెంజ్ విసిరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో రామ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ''తప్పించుకోవడానికి చాలా ట్రై చేశా.. హహ.. ఏదేమైనా.. త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తానని'' అన్నారు. చెప్పినట్లుగా తను వర్కవుట్లు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులందరినీ ఈ ఛాలెంజ్ లో పాల్గొమని నామినేట్ చేశాడు.