టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న హీరోల్లో రామ్ కూడా ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా రామ్ కి ఉన్న క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు. సినిమా బజ్ క్రియేట్ అయ్యేలా బాగానే చేసుకుంటున్నాడు గాని ఆశించిన స్థాయిలో అతనికి హిట్టు అందడం లేదు. 

రీసెంట్ గా వచ్చిన హలో గురు ప్రేమ కోసమే కూడా అతనికి విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ ని మెప్పించాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని ఒక స్టైలిష్ లుక్ ని రామ్ మెయింటైన్ చేస్తున్నట్లు ఒక ఫొటో ద్వారా తెలుస్తోంది. 

ఫుట్ బాల్ ప్లేయర్స్ లా మధ్యలో ఉన్న జుట్టును పైకి నిలబెట్టి సైడ్ కి షార్ట్ కట్ చేయించడం అందరిని ఆకట్టుకుంటోంది. కొంచెం సేపు అలా చూస్తూ ఉంటె ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలో ఉన్నట్లు అనిపిస్తోంది కదా! ఇక ఈ హీరో నెక్స్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే టాక్ ఉంది. గతంలో చర్చలు జరుగుతున్నాయని రామ్ చెప్పాడు. కానీ ఆ పనులు ఎంతవరకు వచ్చేయో క్లారిటీ ఇవ్వలేదు.