మన టాలీవుడ్ హీరోలు సందర్భం వస్తే తప్ప దేనిపై పెద్దగా రియాక్ట్ అవ్వరు. రాజకీయాలంటే అసలే మాట్లాడారు. అందుకే రాజకీయాలపై వారు ఎలాంటి కామెంట్స్ చేసినా.. వైరల్ అవుతుంటుంది. తాజాగా యంగ్ హీరో రామ్ కూడా రాజకీయాలు, ఎన్నికలపై కామెంట్స్ చేశారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎక్కడ చూసినా ఒకటే హడావిడి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ క్రమంలో రామ్ కూడా ఎన్నికలపై స్పందించాడు.

''రాజకీయాలకువయసుతో సంబంధం లేదు. ఇరవై ఏళ్లా, అరవై ఏళ్లా అన్నది కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి. అనుభవం ఉన్నవారు నాయకులుగా నిలబడితే ఇంకా మంచిది.

ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఆ హక్కుతో నిజాయితీ గల నాయకుడ్ని ఎన్నుకోవాలి. దయచేసి ఓటు హక్కుని దుర్వినియోగం చేయకండి'' అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.