మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మిల్కీ బ్యూటీ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

ఈ జోరుని ఇలాగే కొనసాగిస్తూ తాజాగా భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫాన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. డ్యాన్స్, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ సీన్స్, డైలాగ్స్ ఇలా అన్ని విధాలుగా భోళా శంకర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్ లో ఒక షాట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి.. యాంగ్రీ హీరో రాజశేఖర్ మ్యానరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తున్నారు అని నెటిజన్లు అంటున్నారు. ఆ షాట్ చూస్తుంటే అలాగే ఉంది. రాజశేఖర్ స్టైల్ లో చిరు తన చేతులని ఊపుతూ కనిపిస్తున్నారు. చేతులని ఊపుతూ డ్యాన్స్ చేయడం రాజశేఖర్ శైలిలో ఒకటి. అదే తరహాలో చిరు చేస్తున్నారు. చూస్తుంటే అది ఒక హాస్య భరిత సన్నివేశంలా ఉంది. 

గతంలో పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ చిత్రంలో రాజశేఖర్ డ్యాన్స్ ని పెట్టారు. డైలాగ్స్ కూడా చెప్పారు. వాటిపై ఓ సందర్భంలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజశేఖర్ గారిని ఎంతో అవమానించారు. అయినా మేము మాట్లాడలేదు అని అన్నారు. ఇప్పుడు భోళా శంకర్ చిత్రంలో చిరు కూడా రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తే ఎలాంటి వివాదం అవుతోందో మరి. అయితే ట్రైలర్ లో అది చిన్న షాట్ మాత్రమే. చిరు నిజంగానే రాజశేఖర్ ని ఇమిటేట్ చేసారో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాలి.

YouTube video player