Asianet News TeluguAsianet News Telugu

అమ్మ విషయంలో తప్పుచేశాను. జైలుకెళ్తా-రాజశేఖర్

  • పి.ఎస్.వి. గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకొొస్తున్న డా.రాజశేఖర్
  • రెండేళ్ల గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రాజశేఖర్
  • ఇంటర్వ్యూలో గరుడవేగ సినిమా విశేషాలతోపాటు పలు వ్యక్తిగత విషయాలు పంచుకున్న రాజశేఖర్
hero rajasekhar interview about garudavega and other issues

పి.ఎస్.వి. గరుడవేగ సినిమాతో.. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజశేఖర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు మరిన్ని వ్యక్తిగత విషయాలు కూడా రాజశేఖర్ పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

 

ఇన్నాళ్లూ నా ఇమేజ్ కు తక్కువైన సినిమాలు చేశాను. మహంకాళి, గడ్డంగ్యాంగ్ లాంటి సినిమాలు అందుకే ఫెయిలయ్యాయి. కానీ నా ఇన్నేళ్ల అనుభవానికి గరుడవేగలో చేస్తున్న ఎన్ ఐ ఏ ఆఫీసర్ రోల్ సరైన కేరక్టర్. రెండేళ్ల క్రితం ప్రవీణ్ సత్తారు వచ్చి మగాడు పార్ట్-2 అన్న టైటిల్ తో ఈ స్క్రిప్ట్ చెప్పారు. మగాడు సినిమా చూసి ఇనిస్పైర్ అయి చేసిన సబ్జెక్ట్ అని అన్నారు. సబ్జెక్ట్ విని నేను స్టన్ అయాను. మరి దీన్ని అమలు చేయగలరా అన్నాను. నేను బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాను. ప్రతీది స్క్రీన్ లో తీసుకొస్తానన్నారు. హాలీవుడ్ సినిమాలా వుంది. ఎలా చేయగలుగుతారో అనుకున్నా. కానీ సినిమా మొదలయ్యాక.. ఎన్ఐఏ ఆఫీస్ సెట్ చూసాక..సత్తారు చెప్పింది చేస్తారని అర్థమయింది. నన్ను విలన్ వేషాలు వేస్తారా అని కొందకు అడుగుతున్న సమయంలో ప్రవీణ్ వచ్చారు. ఈ సినిమా బడ్జట్ చూస్తే ఎక్కువయ్యేలా వుంది. నిర్మాతలు 5 కోట్ల వరకు పెడతారు. కానీ 25 కోట్ల వరకు పెట్టి కోటేశ్వర్ గారు ఈ సినిమాకు వంద  శాతం న్యాయం చేశారు.

 

కొన్ని హాలీవుడ్ కథల నుంచి మనం సినిమాలు చేద్దామని నేను బాగా బిజీగా వున్న సమయంలో చాలామంది నిర్మాతలు, దర్శకులను అడిగా. అంతా చేద్దామన్నారు కానీ ఎవరూ ముందుకు రాలేదు. కానీ నాకు మార్కెటే లేని సమయంలో ప్రవీణ్ సత్తారు రావడం, గతంలో నేను చేసిన తప్పుల వల్ల ఆస్తులు నష్ట పోయి అమ్మనాన్న అంతా బాధపడుతున్న సమయంలో.. వాళ్లకు ఇక సొంతంగా సినిమాలు చేయనని చెప్పాను. సొంత డబ్బును పోగొట్టను అని చెప్పా. ఇంత పెద్ద బడ్జట్ సినిమా చేస్తే...మునిగిపోతే లేవలేని పరిస్థితి.

 

ఆ సమయంలో నాన్న కోటేశ్వర్ అనే అతను సినిమా చేస్తారని చెప్పారు. అతను సత్తా వున్న నిర్మాత అనుకోలేదు. సబ్జెక్ట్ విని బడ్జట్ అడగ్గా... ప్రవీణ్ సత్తారు మినిమం 7- మాక్స్ 25 కోట్లు అన్నారు. దాంతో చేయలేనన్నారాయన. కానీ చివరకు ఆయనే... మనం చేద్దాం అని మొదలు పెట్టారు. జీవిత కూడా నాతో ఇదే మీ కమ్ బ్యాక్ ఫిలిం అంది. చివరకు అదే నిర్మాత 25 కోట్ ఖర్చు పెట్టేశారు. ఇది నా అదృష్టం. కొందరు చిన్న చిన్న కేరక్టర్లు చేస్తారా అని అడుగుతున్న సమయంలో.. నన్ను ఈ గరుడవేగ సినిమా రూపంలో అదృష్టం వరించిందనే చెప్పాలి.

 

సినిమా మొదలైన 6నెలలకే.. నేను పబ్లిసిటీ గురించి ఫీలయ్యా. ప్రవీణ్ సత్తారుకు కొందరు ఎన్ ఐ ఏ ఆఫీసర్స్ ను తీసుకెళ్లి కలిపించాను. అప్పుడే వాళ్లు అంతా బాగుందని చెప్పారు. నేను పబ్లిసిటీ మొదలు పెడదాం అంటే.. ప్రవీణ్ సత్తారు సినిమా పూర్తయ్యాక పబ్లిసిటీ  చేద్దామన్నారు. ఆయన అన్ని విధాలుగా సినిమాను భుజాన వేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా మాట్లాడారు.

 

కొన్ని సినిమాల్లో బౌండ్ స్క్రిప్ట్ కు ఇంప్రవైజేషన్ వుంటది. డైలాగ్స్ మారుతాయి. కానీ కోడిగుడ్లపై ఈకలు పీకాలేమో అని నేను అనుకున్నట్లు ఏమీ జరగలేదు. స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం రాలేదు. ప్రతి ఒక్కరికి బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలా ఎందుకిచ్చారని అడిగా... ఇది ఎవరైనా కాపీ కొడితే పనికిరాదు. టోటల్ కాపీ కొడితేనే పనికొస్తుంది. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడొద్దన్నాడు. ఈ స్క్రిప్ట్ నేను ఇంతవరకు చేసిన సినిమాల్లో నెంబర్ వన్ ఫిల్మ్ అయ్యేలా అనిపించింది.  ఫస్ట్ కాపీ చూశాక.. మన సినిమా బాగుందని నమ్మకం కలిగింది. అసలు టీజర్ మాకు చూపించగానే మేమంతా.. స్పెల్ బౌండ్ అయ్యాం.

 

అమ్మ విషయంలో తప్పుచేశా. నేను జైలుకెళ్తా..రాజశేఖర్

మా టీజర్ కు మిలియన్ హిట్స్ వస్తే గ్రేట్ అనుకున్నాం. కానీ తొలిరోజు 1 మిలియన్ 5రోజులకు 5 మిలియన్ టచ్ చేసింది. నేను మరిచిపోయిన వాళ్లు కూడా.. మీ గరుడ వేగ టీజర్ చూశాం. సూపర్ వుంది, రిలీజ్ ఎప్పుడని అడగటం మొదలు పెట్టారు. దాంతో క్లౌడ్ నైన్ కి వెళ్లిపోయా.. మళ్లీ పాత రోజులు తిరిగొచ్చాయనుకున్నా. అమ్మ నాన్న మళ్లీ సంతోషించబోతున్నారని, నేను పైకి వచ్చాను చూడండి అని చెప్దామనునుకుంటుంటే.. అమ్మ పోయింది. నేను డాక్టర్ ను. ఏదైనా నయమవుతుంది అని అందరికీ చెప్పే వాణ్ణి. కానీ అమ్మను మాత్రం దక్కించుకోలేకపోయా. అప్పుడే లైఫ్ అంటే ఏంటో అర్థమైంది. లైఫ్ అంటే చాలా వుంది. గొప్ప డాక్టర్ నని ఫీలింగ్ . కానీ అమ్మను కళ్ల ముందే పోగొట్టుకోవటం చాలా గిల్టీగా ఫీలవుతున్నా. అందుకే నేను జైలుకెళ్లి ఖైదీలను కలుస్తా.. అమ్మ చనిపోవటంతో నేను నేరస్థుడిగా ఫీలయ్యా... ఫస్ట్ డే ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్లు బాగానే వుందన్నారు. కానీ రెండో రోజు లాస్ట్ మినిట్ లో ఏమీ చేయలేకపోయాను.. చివరి నిమిషంలో అమ్మకు అలోపతి మెడిసిన్ ఇచ్చాను. కానీ అప్పుడు 5 నిమిషాలు ఆలస్యమైంది. ఆలోచిస్తున్నా. అమ్మ నేను ఇచ్చిన మెడిసిన్ వాడకుండా.. మిగతా డాక్టర్లు ఇచ్చినవి వాడిందా.. అందువల్ల ప్రాబ్లెం అయిందా.. అంటూ 5 నిమిషాలు వేస్ట్ చేయటంతో అమ్మను కోల్పోయా. అమ్మ నన్ను నమ్మలేదు. స్లీపింగ్ పిల్స్ కూడా వద్దన్నా. దేని వల్ల వచ్చిందో అర్థం కాలేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అమ్మను కోల్పోయా. అందుకే జైలుకెళ్తా.

 

ఖైదీలకు గరుడవేగ సినిమా చూపిస్తా. నిజానికి సినిమా తప్ప నాకు వేరే దేంట్లో ఆసక్తి లేదు.. ఫారిన్ వెళ్లాలి, టూర్ వెళ్లాలి అనిపించదా అని అడుగుతుంటారు. కానీ నాకు సినిమాలే ప్రాణం. అలాంటిది నా గరుడ వేగ హిట్టయితే ఏంటి.. పోతే ఏంటి.. అమ్మనే లేదు అనుకున్నా... పిచ్చోన్నయ్యా. దీంతో నా మిత్రులు సైకియాట్రిస్ట్లు వచ్చి ట్రీట్ మెంట్ ఇఛ్చారు. అప్పుడు గరుడవేగ సినిమా ప్రమోట్ చేయాలని , జిల్లాల్లో కూడా తిరగాలని భావించాను. అది కుదరకున్నా.. సినిమాకు ఏం చేయాలో అదంతా చేస్తా. గరుడవేగ లాంటి టీజర్, ట్రైలర్ గతంలో కూడా వచ్చాయి. కానీ ఇందులో ఏదో వుంది కాబట్టే.. జనానికి నచ్చింది.

 

గత రెండేళ్లుగా సినిమా లేదు. అంతకు ముందు వరుసగా ఫ్లాపులు.. అసలు రాజశేఖర్ ను చాలా మంది మరిచిపోయారు. అలాంటి సమయంలో నేను వస్తుంటే... ప్రెస్ వాళ్లు అడిగే ప్రశ్న... ఇంత మంది హీరోలు ఉండగా... రాజశేఖర్ ను పెట్టి సినిమా తీస్తున్నారేంటని ప్రవీణ్ సత్తారును అడుగుతున్నారు. ప్రవీణ్ సత్తారు మాత్రం నేను తప్ప ఎవర్నీ ఊహించుకోలేకపోతున్నానటం సంతోషంగా అనిపించింది.

 

గరుడ వేగ మూవీ టీజర్, ట్రైలర్ కి ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే... అందులో ఏదో కొత్తదనం వుంది. అందుకే ఫస్ట్ యుఎస్ లో బిజినెస్ అయింది. వంద థియేటర్లు దాటింది. రిలీజ్ కూడా గ్రాండ్ గా చేస్తున్నాం. స్టుపెండస్, మార్వలెస్ రెస్పాన్స్ వస్తదని నమ్మకముంది. ఫస్ట్ కాపీ చూశాను. చెప్తున్నా హిట్ అంతే.

 

గరుడ వేగ టైటిల్ గురించి వివరంగా చెప్తే,, సినిమా సస్పెన్స్ పోతది. ఇదేనా గరుడవేగ అనిపిస్తది. నాకు చెప్పటానికి పర్మిషన్ లేదు. ప్రవీణ్ సత్తారు నోరు మూసుకోమన్నారు. అందుకే మూసుకున్నా.. నేను ఎన్ ఐఏ అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తున్నార. నాకు పై ఆఫీసర్ గా నాజర్ చేస్తున్నారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. దీని గురించే ఈ సినిమా వుంటుంది.

 

ఆగ్రహం, మగాడు, అంకుశం, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో నేను చాలా నేచురల్ గా కనిపిస్తా. గతంలో చాలా సినిమాల్లో సినిమాటిక్ గా చేశాను. కానీ ఇప్పుడు మగాడు, ఆగ్రహం, అంకుశం తరహాలో కాకుండా... నార్మల్ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ఎలా వుంటాడో అలాగే కనిపిస్తాను. ఇక ఆ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ఇంట్లో వర్కింగ్ వైఫ్. ఆమె నుంచి భర్తకు సపోర్ట్ లేదు. అలాంటి కేరక్టర్లతో ఎదురయ్యే అనుభవవాలు, గరుడవేగ మిషన్ లతో ఈ సినిమా సబ్జెక్ట్ అందరూ కనెక్ట్ అయ్యేలా, ఎంజాయ్ చేసేలా వుంటుంది. ఇదో పెద్ద కేసును డీల్ చేసే విషయం. మిగతా విషయాలు చెప్పొద్దని నాకు కండిషన్స్ పెట్టారు.

 

నిర్మాతతో పెళ్లి చూపులు లాంటి చిన్న బడ్జట్ సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలాంటి సినిమా చేస్తే వన్ వీక్ లో కలెక్ట్ చేసే పరిస్థితి మార్కెట్ లో వుంది అని చెప్పాం. ఆయన కన్విన్స్ అయ్యారు. అలా గరుడ వేగ మొదలైంది. వన్ వీక్ లో వసూలు చేయొచ్చనే నమ్మకంతో తీశాం. ఈ మూవీ చాలా నేచురల్ గా వుంటది. నమ్మేలా వుంటుంది.

 

రామ్ చరణ్ విలన్ లాంటి పాత్రలైతే విలన్ రోల్ చేస్తా-రాజశేఖర్

ఇక గరుడవేగ సూపర్ డూపర్ హిట్టైందననుకోండి.. అప్పుడు కూడా ఎవరైనా వచ్చి విలన్ రోల్స్ చేస్తారా అని అడిగితే... నాకు నచ్చితే తప్పక చేస్తాను. విలన్ రోల్స్ చేయొద్దని ఏం లేదని అన్నారు. బాలకృష్ణ గారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అప్పుడు పక్కపక్కన కూర్చున్నాం. ఆ సూపర్ రాజశేఖర్.. భలేవుంది అన్నారు. ప్రవీణ్ బాగ చేశాడు. అన్నారు. మీరు ఓకే అంటే.. ప్రవీణ్ సత్తారుతో సినిమా చేద్దాం అన్నా. ఆయన ఓకే అన్నారు. ప్రవీణ్ అవసరమైతే నేను విలన్ గా కూడా చేస్తా అన్నాను. హీరో ఎవరైనా సరే.. సూపర్ విలన్ కేరక్టర్ అయితే చేస్తా. ఇంకా 5 ఏళ్లు హీరోగానే బతికినా... నేను కేరక్టర్, విలన్ చేయాల్సిన రోజు వస్తది. ఇప్పుడైనా నేను రెడీ. అందుకే 30-40 మంది దగ్గర విన్నా. నేను విలన్ రోల్స్ ఎందుకు విన్నానంటే.. జగపతిబాబులాగా డబ్బు, పేరు సంపాదించాలనుకున్నా. మళ్లీ హీరోగా చేయొచ్చు కదా అనుకున్నా.

 

నాకు రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమాలో అరవింద్ స్వామి లాంటి పాత్రలయితే విలన్ గా అయినా చేయాలనుంది. కనీసం అందులో 90 శాతం వున్నా నేను ఆ పాత్ర చేయటానికి రెడీ అన్నారు రాజశేఖర్. ఇక గరుడ వేగ ఆ నలుగురు కలిసి నాకిచ్చిన గిఫ్ట్ అన్నారు. నాన్న, ప్రవీణ్ సత్తారు, కోటేశ్వర్ రాజు, జీవిత కలిసి నాకిచ్చిన ఈ గిఫ్ట్ తనకో టర్నింగ్ పాయింట్ అని రాజశేఖర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios