విచారణకు హాజరుకావాలంటూ రాజ్ తరుణ్ కి పోలీసులు నోటీలు జారీ చేశారు. అయితే రాజ్ తరుణ్ సాకులు చూపుతూ విచారణ డుమ్మా కొట్టాడు. మరి పోలీసులు ఊరుకుంటారా.. ఏం చేయబోతున్నారంటే?
హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య మాటల్లో... రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాము.ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో నన్ను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండుసార్లు అబార్షన్ చేయించాడు. మూడు నెలల క్రితం నా ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు.
ఈ కారణంగా నన్ను దూరం పెడుతున్నాడు. తన వెంటపడొద్దని, వదిలేయకపోతే చంపి... శవం మాయం చేస్తానని బెదిరించాడు. గతంలో రాజ్ తరుణ్ నన్ను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడు. ఈ కేసులో 45 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు కూడా రాజ్ తరుణ్ నాకు ఎలాంటి సహాయం చేయలేదు. నాకు రాజ్ తరుణ్ కావాలి. అందుకే న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాను, అన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
లావణ్య ఆరోపణల మీద రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో నేను రిలేషన్ లో ఉన్నమాట వాస్తమే. కానీ మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. గుడిలో పెళ్లి చేసుకున్నాను అనేది కూడా పచ్చి అబద్ధం. ఆ అమ్మాయి మరొక అబ్బాయితో నా ఇంట్లోనే కలిసి ఉంటుంది. అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టింది. గతంలో లావణ్య మంచి అమ్మాయి. నాకు చాలా సహాయం చేసింది. ఆ కృతజ్ఞతతో నేను భరించాను. ఆమెకు తర్వాత చెత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. డ్రగ్స్ కి అలవాటు పడిందని... కీలక వ్యాఖ్యలు చేశాడు.
లావణ్యకు నార్సింగ్ స్టేషన్ పోలీసులు ఆధారాలు సమర్పించాలని కోరారు. లావణ్య 70కి పైగా ఫొటోలతో పాటు, కొన్ని ఆధారాలు కంప్లంట్ తో పాటు జత చేశారు. లావణ్య ఫిర్యాదులో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా(మాల్వి బ్రదర్) పేర్లు చేర్చారు. పోలీసులు వీరిని వరుసగా A1, A2, A3గా కేసులో పెట్టారు. కాగా జులై 18 లోగా విచారణకు హాజరు కావాలని రాజ్ తరుణ్ కి నోటీసులు పంపారు.
అయితే విచారణకు హాజరు కాలేనని తన లాయర్ చేత లేఖ పంపాడు రాజ్ తరుణ్. వరుస షూటింగ్స్ నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రావడం కుదరదు. కొద్ది రోజుల్లో వస్తానని లేఖలో పేర్కొన్నాడట. కాగా రాజ్ తరుణ్ కి మరొకసారి నోటీసులు పంపేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా వాట్సప్ ప్రైవేట్ చాట్ అంటూ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. సదరు చాట్ లో రాజ్ తరుణ్-మాల్వి మధ్య రొమాంటిక్ సంభాషణ చోటు చేసుకున్నాయి.
