యాక్షన్ మోడ్ లో పవన్ కళ్యాణ్... ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అదిరిపోయే అప్డేట్!
ఎన్నికల తర్వాత చేద్దామని పక్కన పెట్టిన ఉస్తాద్ పట్టాలెక్కింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సెట్స్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. నేటి నుండి పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ నందు పాల్గొంటున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది.

హీరో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోపై ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ ఉంది. ఏకంగా 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ చేతులు కలిపారు. 2012లో గబ్బర్ సింగ్ మూవీ విడుదల కాగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం చేస్తున్నారు. పవన్ అటు పొలిటికల్ గా కూడా బిజీ. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ చిత్రీకరణ పడుతూ లేస్తూ సాగుతుంది. ఒక దశలో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. దీంతో హరీష్ శంకర్ హీరో రవితేజతో మూవీకి సిద్ధం అవుతున్నారని కథనాలు వెలువడ్డాయి.
చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ మీద వచ్చిన పుకార్లపై నోరు విప్పలేదు. దీంతో సినిమా ఆగిపోయినట్లే అని పవన్ ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా ఓ నెల క్రితం ప్రాజెక్ట్ పై అప్డేట్స్ మొదలయ్యాయి. ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా 2024 ఎన్నికలకు ముందే ఈ చిత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈ వాదనలకు బలం చేకూర్చుతూ పొలిటికల్ సెటైర్స్ మామూలుగా ఉండవని హరీష్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు. ఎన్నికల తర్వాత చేద్దామని పక్కన పెట్టిన ఉస్తాద్ పట్టాలెక్కింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సెట్స్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. నేటి నుండి పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ నందు పాల్గొంటున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది.
ఇక హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ జోరు చూస్తుంటే ఎన్నికలకు ముందే ఉస్తాద్ ని థియేటర్స్ లోకి తెస్తారనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.