Asianet News TeluguAsianet News Telugu

Video: యాంకర్ సుమపై ఎన్టీఆర్ కి బాగా కాలినట్టుందే!

అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఓ విషయమై యాంకర్ గా వ్యవహరించిన సుమపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 
 

hero ntr not happy with anchor suma in amigos pre release event
Author
First Published Feb 6, 2023, 8:28 AM IST

చిన్న హీరోలు తమ సినిమాకు ప్రచారం తెచ్చిపెడతారని పెద్ద హీరోలను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలుస్తారు. సదరు స్టార్ హీరో రావడం వలన మేలుతో పాటు ఇబ్బంది కూడా ఉంది. ఫ్యాన్స్ నినాదాలతో వేదిక హోరెత్తిస్తారు. ఇతరులను మాట్లాడనివ్వరు. సందర్భం ఏమిటి, ఫంక్షన్ ఎవరి కోసమని పట్టించుకోకుండా గోల చేస్తారు. ఈ విషయంలో పవన్ ఫాన్స్ కి ఘనమైన చరిత్ర ఉంది. వాళ్ళ గోల భరించలేక పవన్ కుటుంబ సభ్యులైన నాగబాబు, అల్లు అర్జున్ ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

చాలా మంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇదే చేస్తారు. సదరు హీరోకే విసుగొచ్చేలా వాళ్ళ అల్లరి ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం జరిగింది. వేడుక మొదలైనప్పటి నుంచి ఒకటే రచ్చ. ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళ అల్లరి ఎన్టీఆర్ కి కూడా కోపం తెప్పించింది. అభిమానులు కదా ఏమీ అనలేరు. ఆ కోపం కాస్తా యాంకర్ సుమపై చూపించాల్సి వచ్చింది. 

వేడుక చివర్లో ఎన్టీఆర్ మాట్లాడబోతున్నారని చెబుతూ... ఆయన ఎన్టీఆర్ 30 అప్డేట్ కూడా ఇస్తారంటూ, సుమ కామెంట్ చేసింది. సుమ అనాలోచితంగా ఎన్టీఆర్ ని ఇరికించినట్లు అయ్యింది. దాంతో ఎన్టీఆర్ అసహనానికి గురయ్యాడు. ''వాళ్ళు అడక్కపోయినా మీరు చెప్పేసేలా ఉన్నారు'' అని మైక్ లోనే  కోపం ప్రదర్శించారు.  ఆ టెంపర్ ఎన్టీఆర్ స్పీచ్ లో కూడా కనిపించింది. 

ఒక మంచి సినిమా తీయాలంటే సమయం పడుతుంది. సినిమాకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఉంటే కట్టుకున్న భార్య కంటే ముందు మీకే చెబుతాము. కాబట్టి మేకర్స్ మీద ఒత్తిడి తేవద్దు. నా అభిమానులే కాదు ప్రతి స్టార్ హీరో అభిమానికి నేను చేసే రిక్వెస్ట్ ఇదే, అన్నారు. ఎన్టీఆర్ కోప్పడ్డప్పటికీ ఫాన్స్ కోరిక నెరవేర్చాడు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమం, మార్చి 20 లోపు ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశామన్నారు. 2024 ఏప్రిల్ 5న మూవీ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios