దుబాయ్ కి ఎన్టీఆర్... కారణం ఇదే!
జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ పయనమయ్యారు. ఆయన సైమా అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు అక్కడకు వెళుతున్నారు.

దేవర షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్(NTR). ఆయన కొడుకు అభిరామ్ తో పాటు దుబాయ్ వెళుతున్నాడు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఎన్టీఆర్ సైమా అవార్డు గెలుచుకున్ననట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, సిద్దు జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్, అడివి శేష్ టాలీవుడ్ నుండి ఉత్తమ నటుడు కేటగిరిలో పోటీపడుతున్నారు. అయితే అవార్డు ఎన్టీఆర్ ని వరించిందట.
కొడుకు అభిరామ్ తో పాటు దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. అలాగే ఆయన ఎక్కిన ఫ్లైట్ లోనే యాంకర్ హిమజ ఉన్నారట. ఎన్టీఆర్ తో ఆమె ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టారు. దేవర షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చి ఎన్టీఆర్ దుబాయ్ వెల్లడమైంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర విడుదల కానుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కింది.
దేవర అనంతరం వార్ 2 చిత్రంలో నటిస్తారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అయాన్ ముఖర్జీ ఇటీవల హైదరాబాద్ వచ్చి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూశారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వార్ 2 తెరకెక్కుతుంది. అలాగే ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక చిత్రం చేయాల్సి ఉంది.