టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన దర్శకుడికి సపోర్ట్ గా నిలిచారు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా దర్శకుడు రాజశేఖర్ రెడ్డిపై పుట్టుకొచ్చిన ఫేక్ పోస్ట్ లపై స్పందించారు నితిన్.
నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. భీష్మా తరువాత మళ్ళీ ప్లాప్ లు ఫేస్ చేస్తూ వస్తున్న యంగ్ హీరో.. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈసినిమా కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఏపీలోని మాచర్ల కు సంబందించిన కథగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డిపై సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి.
మాచర్ల నియోజకవర్గం దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఏపీలో ప్రధాన రాజకీయాలకు సంబంధించిన కులాలను కించపరుస్తూ... బూతులు తిడుతున్నట్టుగా... ప్రస్తుతం ఉన్న అధికార పక్ష కులాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫేక్ పోస్ట్ లు కనిపించాయి. అంతే కాదు వాటికి వివరణ ఇస్తుస్తూ.. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్ట్ కూడా అందులో ఉంది. ఫేక్ ఐడీతో ఫేక్ పర్సన్స్ పెట్టేవాటిని నవ్వందంటూ అందులో ఉంది. అయితే ఆ పోస్ట్ పై హీరో నితిన్ కూడా స్పందించారు.
ఇక ఈ విషయంలో హీరో నితిన్ ట్వీట్ చేస్తూ.. పాత పోస్ట్ లకు సంబధించిన స్క్రీన్ షార్ట్ ను జోడింది ఈ విధంగా నోట్ రాశాడు.. ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన రచ్చ సృష్టించింది.. దురదృష్టవశాత్తు ఇది ఇతరుల మనోభావాలను దెబ్బతీసింది.. ఇది చాలా విచారకరం అంతే కాదు ఈ పో స్ట్ అందరిని నిరాశపరిచింది ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను అని అన్నారు.
అసలే ఏపీలో ప్రభుత్వానికి - సినిమా వాళ్లకు గ్యాప్ నడుస్తోంది. టికెట్ల రేటు విషయంలో ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా సమస్య అలాగే ఉంది. నితిన్ సినిమా కూడా ఆంథ్రాలోని మాచర్ల ప్రాంతానికి చెందిన కథ కావడం, దర్శకుడిపై ఇలాంటి పోస్ట్ లు దర్శనం ఇస్తుండటంతో సినిమాపై ఈ ప్రభావం కనిపిస్తుందన్న భయంలో ఉన్నాయు మేకర్స్. నితిన్ పవర్ ఫుల్ మాస్ రోల్ చేస్తున్న ఈసినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి, కాథరిన్ థెరీస్సాలు నటించారు. నితిన్ సొంత బ్యానర్ పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ఈసినిమాను నిర్మించారు యంగ్ హీరో.
