ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా ఉత్కంఠ రేకెత్తించే పోరాటాలు ఆస్వాదించాలనుకునే అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. సగం టోర్నీ కూడా ముగియకుండానే నాలుగు మ్యాచ్లు వర్షార్పణం అయ్యాయి. ఈ టోర్నీ ఇంగ్లాండ్ లో జరుగుతోంది. వరుణ దేవుడిని ఏమి అనలేక షెడ్యూల్ ఖరారు చేసిన ఐసీసీపై క్రికెట్ అభిమానులంతా విమర్శలు గుప్పిస్తున్నారు. 

వర్షం వల్ల రద్దైన మ్యాచ్ లలో ఇండియా మ్యాచ్ కూడా ఉంది. గురువారం ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. సినీ స్టార్లు సైతం క్రికెట్ అభిమానులే. అందుకే యంగ్ హీరో నితిన్ ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కావడంతో అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. వరల్డ్ కప్ పై జోకులు వేశాడు. 

ఈసారి ప్రపంచ కప్ ని వర్షానికి ఇచ్చేయాలని ట్వీట్ చేశాడు. నితిన్ ట్వీట్ కు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నిజమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ పై రకరకాల మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఇకపై జరగబోయే మ్యాచ్ లకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఐసీసీ మరింతగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నితిన్ కొత్త చిత్రం భీష్మ ఇటీవల ప్రారంభమైంది. రష్మిక మందన హీరోయిన్. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు.