భీష్మ మూవీతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ మంచి జోష్ మీదున్నారని చెప్పాలి. వరుస పరాజయాల తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మ మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ జోరు థియేటర్స్ కొనసాగుతూ ఉండగానే లాక్ డౌన్ వచ్చి బ్రేక్ వేసింది. నితిన్ త్వరగా మేలుకోవడంతో ఆ మాత్రం ఫలితం దక్కింది. ఇంకొన్నాళ్ళు విడుదల లేటైతే ఓటిటి బాటపట్టాల్సి వచ్చేది. 

నితిన్ ప్రస్తుతం మరో నాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టగా అందులో రంగ్ దే ఒకటి. తొలిప్రేమ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ తరువాత మొదటిసారి ఈ చిత్రం కోసం నితిన్ షూటింగ్స్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. రంగ్ దే టీమ్ షూటింగ్ తిరిగి ప్రారంభించారు. అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య సిబ్బంది షూటింగ్ నిర్వహిస్తున్నారు. 

షూటింగ్స్ సెట్స్ లో దర్శకుడు, హీరో నితిన్ పాల్గొన్న ఫోటోలు బయటికి రావడం జరిగింది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ కీర్తి సురేష్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి వుంది. నితిన్ పెళ్లికానుకగా విడుదలైన టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో తెరకెక్కుతుంది. సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.