నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా పి.వారియర్‌ హీరోయిన్స్. సాధారణంగా తన చిత్రాలకు సంభందించిన విశేషాలను తన సోషల్ మీడియో ఎక్కౌంట్ లో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తూంటుంది రకుల్.

అలాంటిది పూజ కార్యక్రమాలకు హాజరు కాలేదు,సరికదా తను ఆ సినిమాలో నటిస్తున్నట్లు ఎక్కడా పోస్ట్ కూడా పెట్టలేదు. మరో ప్రక్క తను శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం వివరాలను ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులో పెడుతోంది. రీసెంట్ ఆ చిత్రం సెకండ్ షెడ్యుల్ ప్రారంభమైందని ఇనిస్ట్రగ్రమ్ లో షేర్ చేసింది. అంతేకాకుండా హాట్ మ్యాగజైన్ ఫొటో షూట్స్, ర్యాంప్ వాక్ ల మీద దృష్టి పెడుతోంది.  

అలాగే తన బాలీవుడ్ చతి్రం , మిగతా రిలీజ్ లను ప్రమోట్ చేస్తోంది. అలాంటిది నితిన్ సినిమా గురించి ఒక్క మాటా మాట్లాడకపోవటం నితిన్ అభిమానులకు బాధ కలిగిస్తోంది. చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘నితిన్‌కి పక్కాగా సరిపోయే స్ర్కిప్ట్‌ కుదిరింది. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. చంద్రశేఖర్‌ యేలేటి అభిరుచి గల దర్శకుడు. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్‌ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌ శ్రీ వాస్తవ్‌, రచనా సహకారం, మాటలు: వెంకట్‌ నరేష్‌ రెడ్డి, కళ: వివేక్‌ అన్నామలై.