Asianet News TeluguAsianet News Telugu

చిరు, బాలయ్య, నాగ్ సర్‌ సినిమాల్లో చేయడం అదృష్టం.. యంగ్‌ హీరో నిఖిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

`కార్తికేయ 2`తో త్వరలో రాబోతున్న హీరో నిఖిల్‌.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో సినిమాలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

hero nikhil wants to act with chiranjeevi balakrishna nagarjuna reason here
Author
Hyderabad, First Published Aug 11, 2022, 8:31 PM IST

చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి పెద్ద హీరోల సినిమాల్లో చేయడం అదృష్టం అని అంటున్నారు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. అంతేకాదు మున్ముందు `ఇండియానా జోన్స్` తరహాలో సినిమాలు చేస్తానని తెలిపారు. ఆయన హీరోగా నటించిన మూవీ `కార్తికేయ 2`. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శనివారం(ఆగస్ట్ 13న)న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గురువారం మీడియాతో ముచ్చటించారు నిఖిల్‌. ఇందులో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

ఇప్పుడు విలన్‌ పాత్రలు లేవని తెలిపారు నిఖిల్‌. నెగటివ్‌ షేడ్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు హీరోలకు సమానంగా నెగటివ్‌ రోల్స్ ఉంటున్నాయని, `బ్యాట్‌మ్యాన్‌` మూవీస్‌లో హీరోలకు దీటుగా నెగటివ్‌రోల్స్ ఉంటాయని తెలిపారు. అలాంటి పాత్రల కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు అడ్వెంచర్ కథలైన టిన్ టిన్ బుక్స్ అంటే తనకు బాగా ఇష్టమట. `ఇండియానా జోన్స్` లా మనకు ఎన్నో కథలు ఉన్నాయని అవన్నీ తీసి ఇండియన్ గ్రేట్ నెస్ ను చూపించాలనుకుంటున్నట్టు చెప్పారు. 

ఇందులో చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అన్న ప్రశ్నకి నిఖిల్‌ రియాక్ట్ అవుతూ, కచ్చితంగా చేస్తానని తెలిపారు. చిరంజీవి సినిమాల్లో నటిస్తున్నట్టు ఓ రూమర్‌ వచ్చినా బాగుండూ  అని, చిరు, బాలయ్య నాగ్‌ సర్‌ సినిమాల్లో నటించడం గొప్ప అదృష్టమని, తనకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను హీరోగా సినిమాలపైనే ఫోకస్‌ పెడుతున్నానని చెప్పారు. వెబ్‌ సిరీస్‌పై పెద్దగా ఆసక్తి లేదన్నారు. 

ఇక `కార్తికేయ 2` గురించి నిఖిల్‌ మాట్లాడుతూ,2016లో ఈ కథని ఓకే చేశామన్నారు. `పాండమిక్ వల్ల లేట్ అవ్వడంతో రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. చందు గారు మొదటి సినిమాకంటే ఈ సినిమాకు కథ మాటలు  చాలా బాగా రాసుకున్నాడు. ఇందులో నేను ఒక ఫుల్ టైం డాక్టర్ గా పార్ట్ టైం డిటెక్టివ్ గా నటిస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే  దాన్ని అడ్వెంచర్ చేయడానికి వెళ్లే క్యారెక్టర్ లో నటిస్తున్నా. 

`కార్తికేయ 2` హిస్టరీ వర్సెస్ మైథాలజీ గా తీశాము. ప్రతి సీన్ కు ఒక మీనింగ్ ఉంటుంది. మిస్ట్రరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. దేవుడు వున్నాడా లేడా అనే వారికి ఈ సినిమా నచ్చుతుంది.దేవుడంటే ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించాం. కొన్ని కొన్ని సీన్స్ కొండల్లో చేయడం జరిగింది. చాలా మంది కొండల్లో అంటే గ్రాఫిక్స్ పెట్టిస్తారు. మేం ఒరిజినల్‌ లొకేషన్లలోనే చిత్రీకరించాం. 

సినిమాలో కొంత నార్త్ ఇండియా లో జరుగుతుంది. అందుకే అనుపమ్ ఖేర్ గారిని తీసుకోవడం జరిగింది. ఆయన చాలా గ్రేట్ పర్సన్. తనతో చేసే సీన్స్ కొన్ని నాకు భయంగా అనిపించింది. తను చాలా పెద్ద యాక్టర్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా నార్మల్గానే యాక్ట్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ని ఎప్పుడు చూడని కొత్త పాత్రలో చూస్తారు. తను ఎక్సలెంట్ కో యాక్ట్రెస్.

`కార్తికేయ2`ని అన్ని లాంగ్వేజ్ లలో డబ్ చేస్తున్నాము. ఫస్ట్ టైమ్‌ నా సినిమా ఇతర భాషల్లో కూడా డబ్‌ అవుతుంది.చాలా ఆనందంగా ఉంది. ఇందులో కాలభైరవ చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు  చాలా బాగుంటాయి. నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లోని `18 పేజెస్` సినిమా  పెండింగ్ ఉంది. ఆ తరువాత సుధీర్ వర్మ తో ఒక సినిమా చేస్తున్నాము. `స్పై` సినిమా ఈ  ఏడాది చివరకు విడుదల అవుతుంది. దీన్ని మల్టీ లాంగ్వేజ్ లలో తీస్తున్నాము` అని తెలిపారు నిఖిల్‌.

సినిమా థియేటర్ల పరిస్థితిపై చెబుతూ, ఇప్పుడు బాగున్న సినిమాలు ఆడుతున్నాయని, ఏమాత్రం అటు ఇటుగా రిజల్‌ ఉన్నా ఆడటం లేదన్నారు. మిక్డ్స్ టాక్‌ వచ్చిన సినిమాలు ఆడటం లేదని, బాగున్న సినిమాలు బాగా ఆడుతున్నాయని తెలిపారు నిఖిల్‌.

Follow Us:
Download App:
  • android
  • ios