హీరో నిఖిల్‌ ప్రస్తుతం `ది ఇండియా హౌస్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వాటర్‌ ట్యాంక్‌ పగిలిపోయిందట. 

యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం `ది ఇండియా హౌస్‌` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 

అయితే ఈ మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శంషాబాద్‌లో సమీపంలో జరుగుతుంది. షూటింగ్‌లో భాగంగా సముద్రం సీన్లు తీసేందుకు భారీగా సెట్‌ ఏర్పాటు చేశారు. దీంతోపాటు భారీగా వాటర్‌ ట్యాంక్‌ని కూడా ఏర్పాటు చేశారు.

నిఖిల్‌ `ది ఇండియా హౌస్‌` అసిస్టెంట్‌ కెమెరామెన్‌కి తీవ్ర గాయాలు 

వాటర్‌ ట్యాంకర్‌ పగిలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్‌ పగలడంతో లొకేషన్‌ మొత్తం వరదతో నిండిపోయింది. భారీ వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పగిలిపోవడంతో సెట్ మొత్తం అల్లకల్లోలం అయ్యింది. 

ఈ ఘటనలో అసిస్టెంట్‌ కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోది. ఆయనతోపాటు మరికొంత మందికి గాయాలైనట్టు సమాచారం. అదే సమయంలో సెట్‌ కూడా డ్యామేజ్‌ జరిగిందని, నష్టం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

రామ్‌ చరణ్‌ సమర్పణలో `ది ఇండియా హౌస్‌`

ఇక నిఖిల్‌ హీరోగా, సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా `ది ఇండియా హౌస్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రూపొందుతుంది. ఈ మూవీని రామ్‌ చరణ్‌ సమర్పిస్తుండటం విశేషం. అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్‌ వంశీ దర్వకత్వం వహిస్తున్నారు.

1905 నాటి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సినిమా

`ది ఇండియా హౌస్‌` చిత్రం 1905 నాటి స్వాతంత్య్రం పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఆ స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రేమ, విప్లవం అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. 

ఇందులో అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం.