మెడికల్‌ ఎమెర్జెన్సీ కోసం బయటకు వచ్చిన హీరో నిఖిల్‌కి చేదు అనుభవం ఎదురైంది. లాక్‌ డౌన్‌ నిబంధనల దృష్ట్యా ఆయన్ని పోలీసులు ఆడ్డుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

మెడికల్‌ ఎమెర్జెన్సీ కోసం బయటకు వచ్చిన హీరో నిఖిల్‌కి చేదు అనుభవం ఎదురైంది. లాక్‌ డౌన్‌ నిబంధనల దృష్ట్యా ఆయన్ని పోలీసులు ఆడ్డుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. రాష్ట్రలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎవరినీ ఉపేక్షించడం లేదు. అనవసరంగా రోడ్డుపైకి వస్తే వహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో వ్యక్తి ఎవరనేది కూడా చూడటం లేదు. తాజాగా హీరో నిఖిల్‌కి అలాంటి పరిస్థితే ఎదురైంది. 

ఆదివారం అత్యవసరమైన వైద్య సామాగ్రి పంపిణీ చేయడానికి వెళ్లిన హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. `కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాస్‌ ఉండాల్సిందేనని చెప్పారు. 9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని భావించి నేను వచ్చాను` అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. 

Scroll to load tweet…

నిఖిల్‌ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. `డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం` అని రిప్లై ఇచ్చింది. దీంతో సమస్య పరిష్కారమైంది.