యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.
యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఈ ఏడాది నిఖిల్ నుంచి వరుస చిత్రాలు రాబోతున్నాయి. 18 పేజెస్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అలాగే కార్తికేయ 2 జూలైలో రిలీజ్ కి రెడీ అవుతోంది.
అలాగే దసరాకి మరో చిత్రాన్ని దించుతున్నాడు నిఖిల్. నిఖిల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'స్పై'. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి స్పై అనే నామకరణం చేశారు.
తాజాగా ఈ చిత్ర యూనిట్ ఇంట్రో గ్లింప్స్ ని రిలీజ్ చేసింది. సినిమా థీమ్ ని వివరించేలా షార్ట్ అండ్ సింపుల్ గా గ్లింప్స్ కట్ చేశారు. మంచు కొండల్లో దాచిపెట్టిన మారణాయుధాలని బయటకి తీసి అటాక్ కి బయలు దేరాడు నిఖిల్. గ్లింప్స్ సినిమాపై ఉత్కంఠ పెంచేలా ఉంది.
ఇంతకీ నిఖిల్ స్పైగా ఎలాంటి రహస్యాలు ఛేదించాడు.. ఎవరిపై అటాక్ చేయబోతున్నాడు అనేది తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా చిత్రం స్పై మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది.
రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నిఖిల్ నటిస్తున్న కార్తికేయ 2 కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. పాండమిక్ కారణంతో ఈ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా పరిస్థితులు తలిగిపోవడంతో రిలీజ్ కి క్యూ కడుతున్నాయి.

