కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్. సెకండ్ వేవ్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేశారు నిఖిల్‌.

యంగ్‌ హీరో నిఖిల్‌ని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సన్మానించారు. కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో నిఖిల్‌ చేసిన సేవలను గుర్తించిన సజ్జనార్ ఆయన్ని శుక్రవారం సత్కరించారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ విషయాన్ని నిఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

ఈ సందర్భంగా నిఖిల్‌ చెబుతూ, కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ టైమ్‌లో చేసిన పనిని గుర్తించి సీపీ సజ్జనార్‌ గారు ఇలా సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నా` అని పేర్కొన్నారు నిఖిల్‌. ఈ సందర్భంగా సత్కారం అందుకుంటున్న వీడియోని అభిమానులతో పంచుకున్నారు. కరోనా సమయంలో చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నిఖిల్. కోవిడ్ సమయంలో ఈ హీరో చేసిన సేవలను గుర్తించి సజ్జనార్ అభినందించారు. నిఖిల్‌లోని మానవతా దృక్పతాన్ని సజ్జనార్ మెచ్చుకున్నారు.

Scroll to load tweet…

కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్. సెకండ్ వేవ్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేశారు నిఖిల్‌. అలాగే అవసరాలు తెలుసుకుని సాయపడ్డారు. మెడికల్ కిట్స్‌తో పాటు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ వంటివి కూడా కరోనా రోగులకు, వైద్య సిబ్బందికి అందజేశారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వారయ్యారు నిఖిల్‌. 

నిఖిల్‌ ప్రస్తుతం `18పేజెస్‌` చిత్రంలో నటిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్‌ ఇందులో హీరోయిన్‌ ఈ సినిమా ఓ వైపు షూటింగ్‌ జరుపుకుంటూ, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. దీంతోపాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు నిఖిల్‌.