Asianet News TeluguAsianet News Telugu

రేవ్ పార్టీ కేసు... నన్ను వదిలేశారన్న నవదీప్, వైరల్ కామెంట్స్ 

రేవ్ పార్టీ కేసు టాలీవుడ్ ని ఊపేస్తుండగా హీరో నవదీప్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈసారి నన్ను వదిలేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 
 

hero navadeep responds on bengaluru rave party ksr
Author
First Published May 26, 2024, 7:14 PM IST

బెంగుళూరు రేవ్ పార్టీ ఉదంతం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. సీనియర్ నటి హేమ ఈ కేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరు పోలీసులు ఆమె ఫోటో విడుదల చేశారు. బెంగుళూరు పోలీసుల అదుపులో ఉన్న హేమకు రక్త పరీక్షలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని సమాచారం. అయితే హేమ ఈ వార్తలను ఖండిస్తోంది. 

అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఈ ఉదంతం మీద స్పందించాడు. నేరం నిరూపితం అయ్యేవరకు ఒకరిని నిందించడం సబబు కాదు. ఈమెకు కుటుంబం ఉంది. పుకార్లను ప్రచారం చేయవద్దు. హేమ నేరం చేశారని రుజువైన రోజున మేమే చర్యలు తీసుకుంటామని మంచి విష్ణు ట్వీట్ చేశాడు. 

కాగా రేవ్ పార్టీ సంఘటనపై హీరో నవదీప్ స్పందించాడు. ఆయన లేటెస్ట్ మూవీ లవ్ మౌళి విడుదల నేపథ్యంలో ఆయన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మీ పేరు ఎందుకు వినిపించలేదని అడగం జరిగింది. అందుకు సమాధానంగా అది నా అదృష్టం అన్నాడు నవదీప్. 

టాలీవుడ్ లో డ్రగ్ కేసు అంటే మొదటిగా వినిపించేది నవదీప్ పేరు. ఇటీవల ఓ వ్యక్తి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడగా నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. గతంలో కూడా  డ్రగ్స్ కేసుల్లో నవదీప్ పేరు వినిపించింది. ఈ క్రమంలో బెంగుళూరు రేవ్ పార్టీలో నవదీప్ పేరు వినిపించలేదు. అది నా అదృష్టం అని నవదీప్ అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios